గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరంలో ఆరోగ్యకర వాతావరణంలోనే మాంస విక్రయాలు చేపట్టాలని స్టాల్స్ కి నోటీసులు జారీ చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు నగరంలోని డివిజన్ల వారిగా ఎంహెచ్ఓ(ఎఫ్.ఏ.సి) మధుసూదన్ ఆధ్వర్యంలో ప్రజారోగ్య అధికారులు షుమారు 256 మాంస విక్రయ స్టాల్స్ కి నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలోని చికెన్, మటన్ తదితర మాంస విక్రయ దుకాణాలు తప్పనిసరిగా స్టాల్ లోను, పరిసర ప్రాంతాల్లో ఆరోగ్యకర వాతావరణం ఉండేలా భాధ్యత తీసుకోవాలన్నారు. మాంసం విక్రయ ప్రాంతాల్లో అపరిశుభ్ర వాతావరణం ఉంటే ప్రజలు అనారోగ్య బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. నిషేదిత క్యారీ బ్యాగ్ లను వినియోగించవద్దని, వ్యర్దాల సేకరణ చేసే ఏజన్సీకి మాత్రమే వ్యర్ధాలు ఇవ్వాలన్నారు. మాంస వ్యర్ధాలను కాల్వల్లో లేదా రోడ్ల మీద వేస్తె వెంటనే డి&ఓ ట్రేడ్ లైసెన్స్ రద్దు చేయడం, భారీ మొత్తంలో అపరాధ రుసుం విధించడం జరుగుతుందని స్పష్టం చేశారు. నగరంలో మాంసం విక్రయించే స్టాల్స్ నగరపాలక సంస్థ నుండి తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకోవాలని, ఎప్పటికప్పుడు లైసెన్స్ రెన్యువల్ చేసుకోవాలని తెలిపారు. ప్రజలు కూడా మాంసం కొనుగోలు చేసే స్టాల్స్ శుభ్రంగా లేకుంటే కొనుగోలు చేయవద్దని, లేకుంటే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందని సూచించారు. శానిటరీ డివిజన్ల వారిగా శానిటేషన్ కార్యదర్శులతో కలిసి ఇన్స్పెక్టర్ లు మాంసం విక్రయ స్టాల్స్ కి నోటీసులు ఇవ్వాలని, నోటీసులకు స్పందించని స్టాల్స్ పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …