– జిల్లాలో 53 కేంద్రాలలో పరీక్షల నిర్వహణా
– 18501 మందికి గాను హాజరైనా 15,709 (84.91%) మంది అభ్యర్థులు
– ఎస్ కే వి టి డిగ్రీ కళాశాల , ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించిన కలెక్టర్ మాధవీలత, జేసీ తేజ్ భరత్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 53 పరీక్షా కేంద్రాలలో ఏ పి పి ఏస్ సి గ్రూప్ 2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలియ చేశారు. ఆదివారం ఉదయం స్థానిక ఎస్ కె వి టి డిగ్రీ కళాశాలలో , ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలో గ్రూప్ 2 పరీక్షా కేంద్రాలని కలెక్టర్, జెసి లు తనిఖీలు చేశారు. జిల్లా రెవెన్యూ అధికారి జి. నరసింహులు విఎల్ పురంలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజి లో పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ డా కే. మాధవీ లత మాట్లాడుతూ, జిల్లాలో 53 పరీక్షా కేంద్రాలలో గ్రూప్ 2 ఎపిపి ఎస్సి పరీక్షల కు 18501 మంది అభ్యర్ధులు ధరఖాస్తు చేసుకోగా 15,709 (84.91%) మంది హాజారైనట్లు , 2,792 మంది గైరజరైనట్లు తెలియ చేశారు. రాజమండ్రి డివిజన్ లో 35 కేంద్రాలలో , కొవ్వూరు డివిజన్ లో 18 కేంద్రాలలో పరీక్షలను నిర్వహించినట్లు తెలియ చేశారు.
Prajavartha Online Telugu News