Breaking News

InvokED 3.0 ప్రపంచ సదస్సులో ఆకట్టుకున్న ఏపీ ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ప్రసంగం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యాభివృద్ధికి చేపడుతున్న విద్యా సంస్కరణలు, దీక్ష, విద్యా అమృత్ మహోత్సవ్, FLN, టీచ్ టూల్, TPD (Teacher Professional Development) కోర్సులు , SL (స్టాండర్డ్ లెవెల్) శిక్షణ వంటి SALT తదితర కార్యక్రమాలతో పాటు విద్యాశాఖ నిర్వహణలో ఎదురవుతున్న సవాళ్లపై సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు  బి.శ్రీనివాసరావు ఉద్వేగభరితమైన ప్రసంగాన్ని ఇచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యావేత్తలు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వ అధికారులు, దాతృత్వ నాయకులు (philanthropic leaders), స్వచ్ఛంద సంస్థల స్థాపకులు ఎస్పీడీ ని అభినందించారు. బెంగళూరులోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్సెడ్ స్టడీస్ కార్యాలయంలో జరిగిన ‘శిక్షాలోకం’ ఆధ్వర్యంలో నిర్వహించిన InvokED 3.0 ప్రపంచ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానం మీద హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లక్ష ప్రాజెక్టులు సమర్పించి రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిచిన సంగతిని ఎస్పీడీ బి.శ్రీనివాసరావు తన ప్రసంగంలో గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ దీక్షా కో ఆర్డినేటర్ డాక్టర్ టి. మహమ్మద్ ఇస్మాయిల్ ఉన్నారు.

Check Also

తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి శ్యామలరావు గురించి తెలుసుకుందాం

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఒక గొప్ప మెరిట్ స్టూడెంట్ ఆయన, ఎలా అంటే ఎంసెట్ లో 29 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *