Breaking News

ఓటే ఆయుధంగా యువత ఉద్యమించాలి

నరసరావుపేట, నేటి పత్రిక ప్రజావార్త :
రాబోయే ఎన్నికల్లో 50% ఓటింగ్ కల యువత చైతన్యంతో ఓటే ఆయుధంగా ఉద్యమించాలి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ  సంయుక్త కార్యదర్శి వల్లం రెడ్డీ లక్ష్మణరెడ్డీ పేర్కొన్నారు. ఈ నెల 3వ తేది నరసరావు పేటలోని పెరడైజ్ ఫంక్షన్ హాల్లో ఓటు వేద్దాం ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేద్దాం  అంశంపై జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా లోపభూయిష్టంగా ఉందని, ఓటర్ల దొంగలు ఉన్నారని, అధికార యంత్రంగా అధికార పార్టీ నేతలకు తొత్తులుగా మారి అనేక లోపాలకు శ్రీకారం చుట్టారు అని అన్నారు. వాలంటీర్లను ఎన్నికల్లో తమ సైన్యంగా పోలింగ్ ఏజెంట్ లుగా సాక్షాత్తు ముఖ్యమంత్రి, మంత్రులు బహిరంగంగా ప్రకటించడాన్ని ఖండించారు. కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించినా, అధికార పార్టీ  ప్రభుత్వ నేతలు ధిక్కార స్వరాన్ని వినిపించటం, దేశ చరిత్రలో ఎప్పుడు జరగలేదని అన్నారు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా నామినేషన్ వేసే వరకు అర్హులైన వారు ఓటర్లుగా నమోదు కావచ్చని చెప్పారు. గతంలో రాజకీయ నేతలు నైతిక బలం, సేవ బలం,దాతృత్వం సమస్యలపై అవగాహన పటిమకలిగి ఉంటే, నేటి రాజకీయ నేతలు డబ్బులు, మద్యం కులమతాలు రెచ్చగొట్టి  ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని, తద్వారా ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారుతుందని అన్నారు.

నేడు ఆంధ్రప్రదేశ్లో ఇసుక,మద్యం,మట్టి గనులు, మైనింగ్ లాంటి మాఫియాలుగా అధికార పార్టీ నేతలు చేస్తూ పవిత్రమైన రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారని అన్నారు. అధికార యంత్రాంగంపై పట్టు సాధించి రాజకీయ అవినీతిని పెంచి పోషిస్తున్నారని అన్నారు. లోక్ సత్తా ఉద్యమ నేత మాకినేని హరిబాబు ప్రసంగిస్తూ ప్రలోభాలకు లోను కాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. అవినీతిపరులైన రాజకీయ నేతలను ప్రజల తిరస్కరించాలని అన్నారు. రంగం ప్రజా సాంస్కృతిక వేదిక  రాజేష్ నేతృత్వంలోని కళాబృందం ఆట పాట మాటలతో  విచ్చేసిన సబికులందరినీ అలరించారు. కళారూపాలతో ఆకట్టుకున్నారు, ముఖ్యంగా యువతరాన్ని కదిలించి ఆలోచింపజేశారు.

Check Also

తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం

-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *