Breaking News

ఈవీఎంల మొదటి డ్రై రన్ రాండమైజేషన్ ప్రక్రియ

మచిలీపట్నం , నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు సోమవారం ఉదయం జిల్లా ఎన్నికల అధికారి పి రాజాబాబు కలెక్టరేట్లోని విసి హాల్లో రెండో విడతగా ఈవీఎంల మొదటి డ్రై రన్ రాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు. ఈ ప్రక్రియలో జిల్లా ఎన్నికల అధికారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలైన బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి ప్యాట్ లు మూడు రౌండ్లు గమనించి తర్వాత నిర్ధారించుకొని పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ సెగ్మెంట్లకు ఈవీఎంలను కేటాయించారు. అలాగే 7 శాసనసభ నియోజకవర్గాలకు కూడా అవసరమైనన్ని ఈవీఎంలను కేటాయించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, ఈవీఎంల నోడల్ అధికారి నిత్యానందం, సమన్వయకర్త నాగేశ్వర్ నాయక్, సాంకేతిక నిపుణులు సుధా తదితరులు పాల్గొన్నారు

Check Also

సమర్థవంతమైన నాయకత్వంతో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది…

-సాటిలైట్ సిటీ గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న గోరంట్ల… -పిడింగొయ్యి గ్రామంలో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *