Breaking News

రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికారులు సిద్దంగా ఉండాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కీలకమైన బాధ్యతలు అప్పగించిన నోడల్ అధికారులు శుక్రవారము నాటికి వారికీ కేటాయించినా సిబ్బంది, ఇతర అనుబంధ వ్యవస్థ తో కూడి సిద్దంగా ఉండాలని కలక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. గురువారం జిల్లా కలక్టరేట్ లో ఏర్పాటు చేసిన ఎన్నికల విభాగాలను, అక్కడ ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలను జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తో కలిసి పరిశీలించి తగిన సూచనలను చెయ్యడం జరిగింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, త్వరలో కేంద్ర ఎన్నికల కమిషన్ 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉందని, ఆమేరకు షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆయా బాధ్యతలను నిర్వర్తించ వలసిన అధికారులు, అనుబంధ సిబ్బంది డ్యూటీ చార్ట్ సిద్దం చేసుకొని నివేదిక అందచేయాలని ఆదేశించారు. ఎన్నికలలో విధులను నిర్వర్తించాల్సిన నోడల్ అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండడం తో పాటు, షిఫ్ట్ లవారీగా సిబ్బంది కి విధులను కేటాయించాల్సి ఉంటుందన్నారు. మౌలిక సదుపాయాలు, మానవ వనరుల కి చెందిన అంశాలను తక్షణమే దృష్టికి తీసుకుని వొచ్చి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా సజావుగా ఎన్నికల విధులను సక్రమంగా చేపట్టాల్సి ఉంటుందన్నారు.

కలక్టర్ వివిధ ఎన్నికల విభాగాలు పరిశీలించే క్రమంలో మీడియా సెంటర్, మెటీరియల్ సెంటర్, కంప్యూటరైజేషన్ సైబర్ అండ్ ఐ టి విభాగం, విజువల్ మానటారింగ్, ఎమ్ సి సి, ఎక్స్పెండేచర్ కమ్యూనికేషన్ ప్లాన్, కంప్లైంట్ రీడ్రసల్, హెల్ప్ లైన్ విభాగం, సువీద, సివిజిల్, ఇతర ఎన్నికల విభాగాలను పరిశీలించడం జరిగింది.

కలెక్టర్ వెంట జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్, డి ఆర్వో జి. నరసింహులు, ఏ ఆర్వో ఆర్. కృష్ణా నాయక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Check Also

బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *