-అధికారులు, ఉద్యోగులు ఖచ్చితంగా నియమావళిని అనుసరించి ప్రవర్తించాలి
-మార్గదర్శకాలు ఉల్లంఘించిన 23 వాలంటీర్లు తొలగింపు
-44 వ వార్డు పరిధిలోని సచివాలయం 76 , 77 లకు చెందిన 23 మంది వాలంటీర్లు
-మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి అర్బన్ పరిధిలో ప్రజా ప్రతినిధులు నిర్వహించినా కార్యక్రమంలో పాల్గొన్న దృష్ట్యా 23 మంది వార్డు వాలంటీర్లని తొలగించినట్లు రాజమండ్రీ అర్బన్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, మున్సిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యుల్ మార్చి 16 వ తేదీన విడుదల చేసిన దృష్ట్యా ఆరోజు నుంచి ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబందించిన కార్యక్రమాలలో పాల్గొనడం కానీ, ప్రజా ప్రతినిధులను కలవడం గానీ చెయ్యరాదు అని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయమై తగిన సూచనలు చెయ్యడం జరిగిందనీ పేర్కొన్నారు. అయినప్పటికీ స్ధానిక ప్రజా ప్రతినిధి నిర్వహించినా కార్యక్రమంలో పాల్గొనడం వల్ల 23 మంది వాలంటీర్లను తక్షణం విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. నగరపాలక సంస్థ పరిధిలోని 44 వ వార్డ్ పరిధిలో ఉన్న రెండు సచివాలయాలకు చెంది 76 సచివాలయంలో విధులను నిర్వర్తిస్తున్న 10 మందిని 77 వ సచివాలయంలో విధులను నిర్వర్తిస్తున్న 13 మందిని తొలగింపు చేసినట్లు తెలిపారు.
ఎన్నికల షెడ్యూలు విడుదల నాటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలి అని దినేష్ కుమార్ తెలియ చేశారు.