Breaking News

రిటైర్ కాబోయే ఉద్యోగుల కోసం పోస్ట్ రిటైర్మెంట్ ప్రోగ్రామ్

-దిశానిర్దేశం చేసిన సంస్థ ఎం. డి. సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ. పి. ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
APSRTC/APPTD నందు మార్చి 2024 నుండి డిసెంబర్ 2024 వరకు రిటైర్మెంట్ కాబోయే ఫ్రంట్ లైన్ సూపర్ వైజర్ లకు ” పోస్ట్ రిటైర్మెంట్ ప్లానింగ్” ట్రైనింగ్ ప్రోగ్రాం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో VC &MD సిహెచ్. ద్వారకా తిరుమల రావు, ఐ.పి.ఎస్. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (అడ్మిన్) కె.ఎస్.బ్రహ్మానంద రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అకాడెమీ ప్రిన్సిపల్ కుమారి.డి. సాంబ్రాజ్యం మరియు ZSTC ప్రిన్సిపల్ కె. శ్రీలక్ష్మి, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో VC&MD మాట్లాడుతూ రిటైర్మెంట్ తదుపరి ఆరోగ్యం పట్ల, ఆర్దిక భద్రత మరియు ప్రశాంత జీవితం గడపడానికి కావలసిన అన్నిజాగ్రత్తలు తీసుకోవలసినదిగా తెలియజేశారు. ED(Admin) మాట్లాడుతూ RTCఉద్యోగుల శ్రేయస్సు గురించి VC&MD ఎంతో ప్రాముఖ్యతను ఇస్తూన్నారని తెలియజేస్తూ ఉదాహరణగా అత్త్యుత్తమమైన కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్, హెల్త్ స్కీమ్ మరియు ఐడిM కార్డులు లాంటి విషయాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారీస్ ఆర్గనైజేషన్ వారు, ఎస్‌బి‌ఐ వారు, శ్రేయాస్ హాస్పిటల్ వారు రిటైర్మెంట్ తరువాత ఆరోగ్యం, ఆహారం, మానసిక మరియు ఆర్ధిక పరంగా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విశదీకరించారు.

Check Also

మంత్రి సవితకు సీపీఐ రామకృష్ణ అభినందనలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం ఆమోదించడంపై …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *