-సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్యాంకర్లు ఖాతాదారులకు శ్రద్ధతో సేవలందించాలని సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి అన్నారు. విజయవాడలోని విశాలాంధ్ర రోడ్డులో కరూర్ వైశ్యా బ్యాంక్ 836వ శాఖను నాగరాణి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా చదలవాడ మాట్లాడుతూ వినియోగదారులకు సకాలంలో బ్యాంకింగ్ సేవలు అందినప్పుడే మంచి ఫలితాలు ఆశించవచ్చన్నారు. ప్రవేటు రంగ బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలలోని రైతుల అవసరాలకు అనుగుణంగా మంచి పధకాలను ప్రవేశ పెట్టాలన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంజనేయ జ్యువెలరీ నుండి వడ్లమూడి వెంకటరావు, మోడల్ డైరీ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ పిన్నమనేని ధన ప్రకాష్, బ్యాంక్ జనరల్ మేనేజర్ నితిన్ ఆర్కాట్ రంగస్వామి, క్లస్టర్ హెడ్ సూర్య శ్రీ రామ్టేకె చేశారు. మరియు బ్రాంచ్ మేనేజర్ కెఎల్ వి ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు. కరూర్ వైశ్యా బ్యాంక్ 1916లో స్థాపించబడి, ఫైనాన్స్ రంగంలో ప్రముఖ బ్యాంకుగా అవతరించింది.