Breaking News

ఏప్రియల్ 12 , 13 తేదీల్లో మొదటి విడత ర్యాండమనైజేషన్

రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమనైజేషన్
– జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఏప్రిల్ 12 , 13 తేదీల్లో బ్యాలెట్ యూనిట్స్ మొదటి విడత ర్యాండమనైజేషన్ అత్యంత జాగ్రత్తగా నిర్వహించాల్సి ఉంటుందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత స్పష్టం చేశారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ర్యాండమనైజేషన్ ప్రక్రియ పై రిటర్నింగ్ అధికారులు ఇతర అనుబంధ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఉపయోగించే బ్యాలెట్ యూనిట్స్ ను ర్యాండమనైజేషన్ విధానంలో ఆయా నియోజక వర్గాలకు కేటాయింపులు చేయనున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన కార్యచరణ ప్రణాళికా సిద్దం చెయ్యడం జరిగిందని పేర్కోన్నారు. ప్రతీ నియోజక వర్గం నుంచి ఇందు కోసం 11 మంది సిబ్బందిని అందుబాటులొ ఉంచాలని ఆదేశించారు. ఏప్రిల్ 12 , 13 తేదీల్లో ఉదయం 7 గంటలకి ఈ వి ఎమ్ లు భద్రపరచిన ఎఫ్ సి ఐ గోడౌన్ కు చేరుకోవాలని మాధవీలత తెలియ చేశారు. ర్యాండమనైజేషన్ కి సంబంధించిన ప్రక్రియ, సీటింగ్ అరేంజ్మెంట్, సిబ్బంది విధులు, బాధ్యతలు, డేటా నమోదు, ఈ ఎమ్ ఎస్ యాప్ లో వివరాలు అప్లోడ్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఇందుకు సంబంధించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి 12 , 13 తేదీల్లో చేపట్టనున్న పనులపై అవగాహన కల్పించడం జరిగింది. పూర్తి పారదర్శకంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ర్యాండమ నైజేషన్ ప్రక్రియ నిర్వహించడం జరుగుతుందనీ కలెక్టర్/డి ఈ వో కె. మాధవీలత తెలియ చేశారు. ఈ వి ఎమ్ గోడౌన్ లో ఏప్రిల్ 12 , 13 తేదీల్లో రెండు రోజుల పాటు ర్యాండమనైజేషన్ చేపట్టడం జరుగుతుందనీ అన్నారు. ఆమేరకు మొదటి విడత ర్యాండమనైజేషన్ చేసిన అనంతరం ఆయా నియోజక వర్గాల కి బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వివి ప్యాట్స్ లని కేటాయించడం జరుగు తుందనీ అన్నారు. ప్రామాణిక ఆపరేషన్ విధానం మేరకు ర్యాండమనైజేషన్ చేపట్టడం జరగాలని ఆదేశించారు. నియోజక వర్గాల స్ధాయిలో అసెంబ్లీ స్థాయి మాస్టర్ ట్రైనర్ ల శిక్షణ కార్యక్రమం ఏప్రిల్ 10 వ తేదీ నాటికి పూర్తీ చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 15 వ తేదీ పీవో, ఏపిఓ లకీ మొదటి విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించడం కోసం పకడ్బందీగా నిర్వహించేందుకు సన్నాహాలు ఏప్రియల్ 14 నాటికి పూర్తి చెయ్యాలని రిటర్నింగ్ అధికారులనీ ఆదేశించారు. ఆరోజు ఏప్రిల్ 15 న శిక్షణ కోసం వొచ్చే ఎన్నికల సిబ్బంది నియామక ఉత్తర్వులు కాపీ, ఎపిక్ కార్డు కాపీ, ఫారం 12 , రెండూ ఫోటోలు తీసుకుని రావాలని తెలిపారు. ఈ శిక్షణా కార్యక్రమంలో  రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్వో, మునిసిపల్ కమిషనర్ కే. దినేష్ కుమార్, కొవ్వూరు  ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , డి ఆర్వో జీ. నరసింహులు, రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి,  గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి,  నిడదవోలు ఆర్వో – ఆర్ వి రమణా నాయక్ , కే ఆర్ ఆర్ సి – ఎస్.డి.సి. ఆర్. కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్ లు పాల్గొన్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *