Breaking News

శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024

– శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024
-దేవాదాయ ధర్మాదాయ శాఖ అధ్వర్యంలో వేద పండితులకు సత్కార్యం
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు -2024 కింద వేద, ఆగమన పండితులను సత్కరించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కే. మాధవీలత తెలియ చేశారు. మంగళవారం ఉదయం స్థానిక కలెక్టర్ విడిది కార్యాలయంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది పురస్కారములు-2024 వేడుకలను పురస్కరించుకుని సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రతి ఏడాది ఉగాది పండుగ సందర్భంగా వేద, ఆగమన పండితుల సత్కరించడం సంప్రదాయంగా జరుపుకోవడం జరుగుతోందనీ పేర్కొన్నారు. ఈ e నేపధ్యంలో పండితులకు నగదు పురస్కారాన్ని, మెమెంటో అందచేసి, శాలువా తో సత్కరించడం జరిగిందనీ తెలియ చేశారు. రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో విజయవంతంగా ఎన్నికల నిర్వహణలో అందరం సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. వేడుకల్లో భాగంగా వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు.

సత్కార గ్రహీతలు:
తంత్రసార ఆగమం పండితులు అప్పలి వరాహ నరసింహారావు, అర్చకలు , యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్, విజ్యేశ్వరం గ్రామం, నిడదవోలు మండలం – నగదు పురస్కారం .10,116/- వైఖానస ఆగమన పండితులు అగ్నిహోత్రం వెంకట సీతారామానుజా చార్యులు, అర్చకులు – వెంకటేశ్వర &  సీతారామ స్వామి దేవాలయం, గోపాలపురం – నగదు పురస్కారం .10,116/- శైవ ఆగమన పండితులు శ్రీ చెరుకూరి భీమశంకరం, అర్చకులు,  రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం, రాజమండ్రీ – నగదు పురస్కారం ₹.10,116/- శైవ ఆగమన పండితులు  రుద్రపాక శేషగిరి రావు, అర్చకులు –  సంగమేశ్వర స్వామి దేవాలయం, అన్నదేవరపేట గ్రామం, తాళ్ళపూడి మండలం – నగదు పురస్కారం .1,116/- (ఈయన తరపున దేవాదాయ శాఖ అధికారులు అందుకున్నారు) వైఖానస ఆగమన పండితులు పొన్నూరి అనంత సత్య వల్లభాచార్యులు, అర్చకులు , –  వెంకటేశ్వర స్వామి దేవాలయం, ధవళేశ్వరం – నగదు పురస్కారం .1,116/- శైవ ఆగమన పండితులు పూజ్యం శంభుప్రసాద్, అర్చకులు, విశ్వేశ్వర స్వామి దేవాలయం, వడిశలేరు – నగదు పురస్కారం .1,116/- ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ ధర్మాదాయ అధికారి వి. సోమరాజు, వివిధ ఆలయాల ఈ వో, దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ సర్వే చేస్తున్నారు…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని తూర్పు, పశ్చిమ నియోజకవర్గాల్లో బిఎల్ఓలు ఇంటింటి ఓటర్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *