-నర్సింగ్ సిబ్బందికి అధునాతన భద్రతా చర్యలు మరియు ఈ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై శిక్షణ ఇవ్వడం ఈ కార్యక్రమం లక్ష్యం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆసుపత్రి సిబ్బందిలో భద్రతపై అవగాహన పెంచేందుకు ‘‘ఎయిమ్ ఫర్ సేఫ్టీ’’ కార్యక్రమాన్ని బెక్టన్ డికిన్సన్ ఇండియాతో కలిసి మణిపాల్ హాస్పిటల్ (విజయవాడ) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో దాదాపు 250 మంది నర్సింగ్ సిబ్బంది పాల్గొన్నారు. మణిపాల్ హాస్పిటల్ (విజయవాడ) కు చెందిన క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉత్తమ్ శర్మ, నర్సింగ్ సూపరింటెండెంట్ శ్రీమతి బి వసంత, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ మనోజ్ కుమార్, ఇంటెన్సివిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ రావు టి, మైక్రోబయాలజిస్ట్ డాక్టర్ పి శిరీష ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధునాతన భద్రతా చర్యలు, ఈ దిశలో తీసుకోవలసిన జాగ్రత్తలపై నర్సింగ్ సిబ్బందికి శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఈ కార్యక్రమం జరిగింది.
సాంకేతిక పురోగతులు, వినూత్న సంరక్షణ విధానాలు, ప్రపంచ సంఘటనల ప్రభావంతో నర్సింగ్ రంగం నిరంతరం రూపాంతరం చెందుతోంది. అధిక-నాణ్యత సంరక్షణను అందించడానికి, నర్సులతో సహా ఆరోగ్య సంరక్షణ నిపుణులు అభివృద్ధి చెందుతున్న పరిశ్రమ పోకడలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండా లి. అందుకే విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
ఈ సందర్భంగా విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి మాట్లాడు తూ, ‘‘మనం ఎప్పటికప్పుడు మారుతున్న ఆరోగ్యసంరక్షణ రంగంలో ప్రయాణిస్తున్న తరుణంలో, విజయ వాడ లోని మణిపాల్ హాస్పిటల్‌లో భద్రతకు ప్రాధాన్యతనిస్తూ, ఈ పరిశ్రమను తీర్చిదిద్దుతున్న ఆవిష్కరణ లను స్వాగతిస్తున్నాం. ‘ఎయిమ్ ఫర్ సేఫ్టీ’ ప్రోగ్రామ్ కోసం బెక్టన్ డికిన్సన్ ఇండియాతో మా భాగస్వామ్యం మా సిబ్బంది, రోగుల ఆరోగ్యం మరియు భద్రతను రక్షించడంలో మా అంకితభావాన్ని ప్రదర్శిస్తుంది. ఈ కార్యక్రమం ద్వారా మేం మా నర్సింగ్ బృందానికి తాజా పురోగతులు, జాగ్రత్తల గురించి అవగాహన కల్పి స్తాం. ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ వాతావరణంలో అత్యున్నత ప్రమాణాల సంరక్షణను అందించడానికి వారికి సాధికారత కల్పిస్తాం. ప్రస్తుత ట్రెండ్‌లతో తాజాగా ఉండటం మరియు ఆవిష్కరణలను స్వీకరించడం ద్వారా, మా కమ్యూనిటీకి అసాధారణమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించే మా మిషన్‌ను మేము కొనసాగించగలమని నమ్ముతున్నాం’’ అని అన్నారు.
విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్ డా.ఉత్తమ్ శర్మ మాట్లాడుతూ, ‘‘మా సంస్థలో భద్రత, శ్రేష్ఠత యొక్క సంస్కృతిని పెంపొందించడానికి మేం ప్రగాఢంగా కట్టుబడి ఉన్నాం. బెక్టన్ డికిన్సన్ ఇండియా భాగస్వామ్యంతో నిర్వహిస్తున్న ‘ఎయిమ్ ఫర్ సేఫ్టీ’ కార్యక్రమం, రోగులు మరియు సిబ్బందికి అత్యున్నత ప్రమాణాల సంరక్షణ భరోసాకు సంబంధించి మీ అంకితభావాన్ని ఒక ఉదాహరణగా చూపుతుంది’’ అని అన్నారు. .
‘‘అధునాతన శిక్షణను అందించడం, భద్రతా చర్యల ప్రాముఖ్యతను నొక్కి చెప్పడం ద్వారా, సరైన ఆరోగ్య సంరక్షణ ఫలితాలను అందించడానికి మా నర్సింగ్ బృందానికి మేం సాధికారత కల్పిస్తాం. మేమంతా కలసి మారుతున్న ఆరోగ్య సంరక్షణ స్థితిగతులకు అనుగుణంగా కొనసాగుతాం. రోగుల భద్రత, సంరక్షణ నాణ్యతను మెరుగుపరచడానికి ఆవిష్కరణలు, ఉత్తమ అభ్యాసాలను మెరుగుపరుస్తాం’’ అని అన్నారు.
జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అనంతరం, క్లస్టర్ డైరెక్టర్ డాక్టర్ సుధాకర్ కంటిపూడి ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం డాక్టర్ ఉత్తమ్ శర్మ – మెడికల్ సూపరింటెండెంట్, డా. టి శ్రీనివాస్ రావు – ఇంటెన్సివిస్ట్, డా.పి. శిరీష – మైక్రోబయాలజిస్ట్, డా. సిహెచ్ మనోజ్ కుమార్ – జనరల్ ఫిజిషియన్, బి. సతీష్ కుమార్ – బిడి మేనేజర్, శ్రీమతి బి. వసంత – నర్సింగ్ సూపరింటెండెంట్ తమ సందేశాలను అందించారు.
మణిపాల్ హాస్పిటల్ (విజయవాడ) నర్సింగ్ సూపరింటెండెంట్ బి వసంత ఈ సందర్భంగా మాట్లాడు తూ, ‘‘బెక్టన్ డికిన్సన్ ఇండియా సహకారంతో ‘ఎయిమ్ ఫర్ సేఫ్టీ’ కార్యక్రమంలో భాగమైనందుకు మేం సంతోషిస్తున్నాం. అధునాతన భద్రతా చర్యలు, ప్రోటోకాల్‌ల పరిజ్ఞానంతో మా నర్సింగ్ బృందాన్ని సన్నద్ధం చేయడం ద్వారా మా రోగులు, సిబ్బంది ఇద్దరి శ్రేయస్సును నిర్ధారించడంపై మా ప్రాథమిక దృష్టి ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్‌లకు అనుగుణంగా ఆవిష్కరణలను స్వీకరించడం ద్వారా, ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతున్న ఆరోగ్య సంరక్షణ వాతావరణంలో అధిక-నాణ్యత సంరక్షణను అందించే మా సామర్థ్యా న్ని మేం మెరుగుపరుస్తాం. ఈ కార్యక్రమం ద్వారా, మా నర్సింగ్ విభాగంలో నిరంతర అభివృద్ధి, ఆవిష్కరణల సంస్కృతిని పెంపొందించడం ద్వారా శ్రేష్ఠత, రోగి భద్రత పట్ల మా నిబద్ధతను మేం పునరుద్ఘాటిస్తున్నాం’’ అని అన్నారు.