అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
దేశవ్యాప్తంగా స్వాదీనం చేసుకున్న మొత్తం సొత్తు రూ.4,658 కోట్లలో రూ.125.97 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి స్వాదీనం చేసుకోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వాదీనం చేసుకున్న రూ.125.97 కోట్లలో రూ.32.15 కోట్ల నగదు, రూ.19.72 కోట్ల విలువైన లిక్కరు, రూ4.06 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.57.14 కోట్ల విలువైన ప్రెషస్ మెటల్స్ మరియు రూ.12.89 కోట్ల విలువైన ఫ్రీబీస్/ఇతర వస్తులను రాష్ట్రంలో స్వాదీనం చేసుకోవడం జరిగింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో జిల్లా ఎన్నికల అధికారులు, ఎస్సీలు, 20 కి పైగా ఎన్ఫోర్సుమెంట్ ఏజన్సీలతో తరచుగా సమీక్షలు, సమావేశాలు నిర్వహించడం వల్లే ఇది సాధ్యమైంది. అదే విదంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెక్ పోస్టులు, అంతర్ రాష్ట్ర చక్ పోస్టుల్లో పటిష్టమై నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయడం, అధికారులు, పోలీసులు నిరంతరాయంగా గస్తీ కాయడం మరియు చురుకైన పౌరుల భాగస్వామ్యం, సాంకేతికత సహకారమే ఇంత మొత్తంలో సొత్తును రాష్ట్రంలో స్వాదీనం చేసుకోవడం సాధ్యమైంది.
Tags AMARAVARTHI
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …