Breaking News

సి.ఎం.పై రాయితో దాడిచేసిన కేసు దర్యాప్తును వేగవంతం చేయండి

విజయవాడ నగర సి.పి. రాణాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించిన సీఈఓ మీనా

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పై ఎన్టీఆర్ జిల్లా విజయవాడ అజిత్ సింగ్ నగర్ డాబా కొట్ల సెంటర్ సమీపంలో శనివారం రాయితో దాడిచేసిన ఘనకు సంబందించిన కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శ్రీ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ నగర సి.పి. కాంతి రాణా టాటాను, ఐ.జి. రవిప్రకాష్ ను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన ఛాంబరులో వారిరువురితో ఆయన సమావేశమై ఘనటనకు సంబందించిన పూర్వా పరాలపై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న “మేమంతా సిద్దం” బస్సు యాత్రలో ఇటు వంటి దుర్ఝటన ఏ విధంగా చోటు చేసుకుంది, దాడి చేసేందుకు నిందితులకు ఏ విదంగా అవకాశం ఏర్పడింది, పూర్తి స్థాయిలో బందోబస్తు ఉన్నప్పటికీ నిందితులు ఏ విధంగా రాయితో దాడిచేయగలిగారు అనే విషయాలపై పోలీస్ అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ ఘనటకు సంబందించి ఇప్పటికే అదుపులోకి తీసుకున్న కొంతమంది నిందితుల విచారణ ఏ విధంగా సాగుచున్నది, ఆ విచారణలో బయటపడిని విషయాలపై ఆయన ఆరాతీశారు. ఈ కేసుకు సంబందించిన దర్యాప్తును మరింత వేగవంతం చేసి సమగ్ర నివేదికను సాద్యమైనంత త్వరగా అందజేయాలన ఆదేశించారు. రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఇతర ప్రముఖ వ్యక్తుల పర్యటనల్లో ఇటు వంటి దుర్ఝటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనే ఆవశ్యకతను ఆయన నొక్కిచెపుతూ, అందుకు తగ్గట్టుగా రాష్ట్ర స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు అనే అంశంపై ఆయన ఆరాతీశారు.

ఈ దుర్ఝటనకు సంబందించిన పూర్వాపరాలు, ప్రస్తుతం జరుగుచున్న దర్యాప్తు ప్రగతిని వీడియో విజ్యువల్స్, ఫొటోల ద్వారా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనాకు వివరించారు.

Check Also

ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *