-జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
-ఎన్నికలలో పోటి చేసే అభ్యర్థులకు ఖర్చుల విషయంలో అవగాహన కల్పించాలి. .. రోహిత్ నగర్ (Rohit Nagar)
-ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలు పై ప్రజల్లో అవగాహన కల్పించాలి .. నితిన్ కురాయిన్ (Nithin Kurain)
-రిజిస్టర్ నిర్వహణా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి .. జై అరవింద్ (Jai Aravind)
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల విధుల్లో ఖర్చుల విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవడం తో పాటు అవగాహన కల్పించడం జరుగుతోందని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.
శుక్రవారం సాయంత్రం కలక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎన్నికల అధికారి అధ్వర్యంలో జిల్లా ఎన్నికల ఖర్చుల పరిశీలకులు.. ఖర్చుల పర్యవేక్షణ పై నోడల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత వివరాలు తెలియచేస్తూ, జిల్లాలో ఒక పార్లమెంటు, ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలలో 2024 సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని అనుసరించి కార్యచరణ రూపొందించడం జరిగిందన్నారు. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల పై నిఘా పెట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. అందులో భాగంగా 24 వీడియో సర్వైవల్ బృందాలు నియమించడం జరిగిందన్నారు. వీటికి అదనంగా మరో 25 వీడియో వ్యూవింగ్ బృందాలు, 16 అకౌంటింగ్ బృందాలు క్షేత్ర స్థాయిలో విధులు నిర్వర్తిస్తున్నారు అని పేర్కొన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా సమగ్ర వ్యయ పర్యవేక్షణకు తీసుకున్న చర్యలు తీసుకోవడం జరిగిందనీ, ఇందుకు అనుగుణంగా సంబందిత శాఖల ఆద్వర్యంలో కోర్ టీమ్ లని నియమించామని తెలియ చేశారు. ఆయా శాఖల అధికారులు పరిశీలకులకీ కలెక్టర్ పరిచయం చేశారు. ఆయా బృందాలతో పనిచేసిన అధికారులూ అందచేసిన శిక్షణ కార్యక్రమం వివరాలు తెలియచేశారు.
ఈ సందర్బంగా జిల్లా ఖర్చుల పరిశీలకులు క్షేత్ర స్థాయిలో పర్యటన నేపథ్యంలో రికార్డుల నిర్వహణ, నామినేషన్లు ప్రక్రియ ప్రారంభం అయిన దృష్ట్యా చేపడుతున్న కార్యకలాపాలు పై సమీక్షా నిర్వహించారు. అభ్యర్ధుల నామినేషన్ పత్రాలు దాఖలు చెసే సమయంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన నియమావళిని, మార్గదర్శకాలను, అనుసరించి వివరాలు అందజేయడం, తగిన సూచనలు చెయ్యడం జరుగుతున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు చేస్తున్న ఖర్చుల పై నిఘా పెట్టడం జరిగిందనీ తెలియ చేశారు. ఇకపై ఖర్చులను నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్ధుల ఖాతా కింద నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సమావేశం లో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్, మున్సిపల్ కమీషనర్ కే.దినేష్ కుమార్, డి ఆర్వో జి.నరశింహులు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.