Breaking News

జిల్లాలో నామినేషన్ల పర్వం ఆరవ రోజు 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు

– విజయవాడ పార్లమెంటు నియోజకవర్గానికి 11 మంది
– ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు 47 మంది నామినేషన్లు దాఖలు
– జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నామినేషన్ల పర్వం లో ఆరవ రోజైన 24వ తేది బుధవారం జిల్లాలో మొత్తం 58 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి 11 మంది నామినేషన్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 47 మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేసిన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.డిల్లీరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. మే 13 న నిర్వహించనున్న పార్లమెంటు, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు ఆయన తెలిపారు. నామినేషన్ల స్వీకరణలో భాగంగా ఆరవ రోజైన 24వ తేదీ బుధవారం వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు కలిపి మొత్తం 58 మంది అభ్యర్థుల నుండి నామినేషన్లు స్వీకరించిన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు తెలిపారు. ఇందులో భాగంగా విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి 11 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అభ్యర్థిగా కేశినేని శ్రీనివాస్‌ (నాని), నవతరం పార్టీ అభ్యర్థిగా వై. కృష్ణ కిశోర్‌, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఐఎన్‌సి) అభ్యర్థిగా వల్లూరు భార్గవ్‌, తెలుగు దేశం పార్టీ అభ్యర్థులుగా కేశినేని జానకి లక్ష్మి, కేశినేని శివనాథ్‌ (చిన్ని), బహుజన సమాజ్‌ పార్టీ (బిఎస్‌పి) అభ్యర్థిగా యం. వెంకటేశ్వరరావు, జై భీమ్‌రావు భారత్‌ పార్టీ అభ్యర్థిగా దాట్ల లూర్థు మేరి, జన రాజ్యం అభ్యర్థిగా డి. కూమారి, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థిగా డి. రవీంద్ర బాబు, స్వంతత్ర అభ్యర్థులుగా యం. వెంకట కనకరావు, పి. వెంకట అశోక్‌, ఒక్కొక్క సెట్టు నామినేషన్‌ను సమర్పించడం జరిగిందన్నారు.
విజయవాడ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో భారతీయ జనతా పార్టీ (బిజెపి) అభ్యర్థిగా యలమంచిలి సత్యనారాయణ చౌదరి రెండు సెట్లు, ఇండియన్‌ యూనియన్‌ ముస్లిమ్‌ లీగ్‌ పార్టీ అభ్యర్థిగా షేక్‌ కాజావలి, కమ్యూనిస్ట్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా జి. కోటేశ్వరరావు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అభ్యర్థిగా షేక్‌ ఆసీఫ్‌, ఆల్‌ ఇండియా ఫార్వడ్‌ పార్టీ అభ్యర్థిగా నాగెండ్ల దేవ సహాయం, జై భారత్‌ నేషనల్‌ పార్టీ అభ్యర్థిగా పోతిన వెంకట రామావావు, స్టూడెంట్‌ యునైటెడ్‌ ఫర్‌ నేషన్‌ అభ్యర్థిగా కాకానీ వెంకటేశ్వరరావు, సమాజ్‌ వాధి పార్టీ అభ్యర్థిగా రమణ ప్రసాద్‌ కొత్తమాస్‌, స్వతంత్ర అభ్యర్థులుగా వినోద్‌ కుమార్‌ ఎర్రబత్తుల, లొల్ల చంద్రశేఖర్‌, ఒక్కొక్క సెట్టు నామినేషన్‌ను సమర్పించడం జరిగిందన్నారు.
విజయవాడ సెంట్రల్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అభ్యర్థులుగా వెలంపల్లి శ్రీవాణి, వెలంపల్లి శ్రీనివాసరావు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా బోండా ఉమామహేశ్వరరావు, బహుజన సమాజ్‌ పార్టీ అభ్యర్థిగా ఇనపనూరి రాజేంద్ర ప్రసాద్‌, తెలుగు రాజాధికార సమితి పార్టీ అభ్యర్థిగా పి. సుబ్రహ్మణ్యం, ఆంధ్ర రాష్ట్ర ప్రజా సమితి అభ్యర్థిగా గొల్లపల్లి శ్రీ ఫణిరాజ్‌, స్వతంత్ర అభ్యర్థులుగా జోన్న విత్తుల రామలింగేశ్వరరావు, వి. జయపూర్ణ చంద్రరావు, కొణిజేటి ఆదినారాయణ, చంద్రశేఖర్‌ పెదపాటి దాసరి నాగరాజు ఒక్కొక్క సెట్టు నామినేషన్‌ను సమర్పించడం జరిగిందన్నారు.
విజయవాడ తూర్పు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఏడుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అభ్యర్థిగా దేవినేని అవినాష్‌ నాలుగు సెట్లు, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోనుగు పాటి నాచారయ్య రెండు సెట్లు, తెలుగు దేశం పార్టీ అభ్యర్థులుగా గద్దె రామోహన్‌, గద్దె క్రాంతి కుమార్‌, జై భీమ్‌ రావు భారత్‌ పార్టీ అభ్యర్థిగా మేడెం విజయ్‌ శేఖర్‌, జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా జత్తి వసుంధర, స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా అవినాస్‌ సిద్దెల ఒక్కొక్క సెట్టు నామినేషన్‌ను సమర్పించడం జరిగిందన్నారు.
మైలవరం అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో భారత చైతన్య యూవజన పార్టీ అభ్యర్థి ముప్పసాని భూలక్ష్మి, రెండు సెట్లు, తెలుగుదేశం పార్టీ (టిడిపి) అభ్యర్థులుగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్‌ ఒక సెట్టు, స్వతంత్ర అభ్యర్థులుగా పూలిపాక ప్రకాష్‌ బాబు రెండు సెట్లు, భూక్య కోటేశ్వరరావు రెండు సెట్లు, ప్రత్తి సాయి దాసరధి ఒక సెట్టు నామినేషన్‌ను సమర్పించడం జరిగిందన్నారు.
్‌ నందిగామ అసెంబ్లీ నియోజకవర్గం సంబంధించి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్‌రావు రెండు సెట్లు నామినేషన్‌ దాఖలు చేయడం జరిగిందన్నారు.
తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి తొమ్మిది మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో భారత చైతన్య యువజన పార్టీ అభ్యర్థులుగా సిహెచ్‌ వెంకటేశ్వరరావు, శ్రీకాకులపు వెంకయ్య, ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా లాం తాంతియ్యా కుమారి, తెలుగు దేశం పార్టీ అభ్యర్థులుగా కొలికపూడి శ్రీనివాసరావు, కోట పుల్లమ్మ, స్వతంత్య్ర అభ్యర్థులుగా వి. మెహర్‌బాబా, కొర్లపాటి రవీంద్రబాబు, కొలికపోగు వెంకట్రావు, కె. కృష్ణయ్య, ఒక్కోక్క సెట్టు నామినేషన్‌ దాఖలు చేసిన్నట్లు తెలిపారు.
జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి నలుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా ఇందులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సిపి) అభ్యర్థులుగా సామినేని ఉదయభాను మూడు సెట్లు, సామినేని విమల, తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా శ్రీరామ్‌ రాజగోపాల్‌, స్వతంత్ర అభ్యర్థిగా జిల్లేపల్లి సుధీర్‌బాబు ఒక్కొక్క సెట్టు నామినేషన్‌ దాఖలు చేసిన్నట్లు జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.డిల్లీరావు ప్రకటనలో వివరించారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *