విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరు, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ పరిశీలకులు (జనరల్ అబ్జర్వర్)గా నియమితులైన ఐఏఎస్ అధికారి మంజూ రాజ్‌పాల్ బుధవారం కలెక్టరేట్లోని ఇంటెగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని సందర్శించారు. సీ-విజిల్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి, ఐటీ, బ్యాంకింగ్, కమర్షియల్ ట్యాక్స్, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్), కస్టమ్స్ తదితర విభాగాల కార్యకలాపాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు ఓటర్ హెల్ప్‌లైన్ 1950, నేషనల్ గ్రీవెన్స్ సర్వీస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ), వాట్సప్, కాల్ సెంటర్, కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎంఎస్), సీఈవో మెయిల్స్, సీ-విజిల్స్ తదితరాల ద్వారా 1,799 ఫిర్యాదులు రాగా 1,766 ఫిర్యాదుల పరిష్కారం పూర్తయినట్లు అధికారులు వివరించారు. స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్‌లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ బృందాలను క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జీపీఎస్ పరికరాల ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నాయి? ఆయా నిఘా బృందాల కదలికలను పరిశీలించే కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరును పరిశీలించారు. రోజువారీ నివేదికల నిర్వహణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ (కమిటీ), సోషల్ మీడియా సెల్ విభాగాల కార్యకలాపాలను పరిశీలించారు. రాజకీయ ప్రకటనల ప్రీ సర్టిఫికేషన్, ఫేస్బుక్, వాట్సాప్ తదితర సామాజిక మాధ్యమాల్లో పోస్టింగ్‌లకు సంబంధించి వస్తున్న ఫిర్యాదులు, వాటి పరిష్కారం తదితర అంశాలను జనరల్ అబ్జర్వర్ మంజూ రాజ్‌పాల్ పరిశీలించారు. జనరల్ అబ్జర్వర్ వెంట డిఆర్ఓ వి.శ్రీనివాసరావు, ఎంసీఎంసీ మెంబర్ సెక్రెటరీ యు. సురేంద్రనాథ్, ఎంసిఎంసి సభ్యులు వెలగా జోషి తదితరులు ఉన్నారు
నేరుగా ఫిర్యాదుకు వీలు:
జనరల్ అబ్జర్వర్ మంజూ రాజ్ పాల్ ను నేరుగా కలిసి ఎన్నికల ఫిర్యాదులు, విజ్ఞాపనలు అందించవచ్చని ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు విజయవాడ మునిసిపల్ గెస్ట్ హౌస్ గ్రౌండ్ ఫ్లోర్, నందమూరి రోడ్డు, బృందావన్ కాలనీ, లబ్బీపేట చిరునామాలో అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. అదే విధంగా ఫోన్ నెంబర్ 8121526777 లో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.
Prajavartha Online Telugu News