– స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు సాధారణ అబ్జర్వర్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి నరీందర్ సింగ్ బాలి బుధవారం విజయవాడ నగరానికి విచ్చేశారు. స్థానిక మునిసిపల్ గెస్ట్ హౌస్ వద్ద నరీందర్ సింగ్ బాలికి జాయింట్ కలెక్టర్ సంపత్ కుమార్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సమావేశంలో జిల్లాలో ఎన్నికలను ప్రజాస్వామ్య స్ఫూర్తితో స్వేచ్ఛాయుత వాతావరణంలో భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్వహించేందుకు చేసిన ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ వివరించారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రం (ఐసీసీసీ) కార్యకలాపాలు, పీవో, ఏపీవోల శిక్షణ, పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు, వివిధ ఫారాల పరిష్కారం, ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) తదితరాల గురించి వివరించారు. అదే విధంగా వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఫిర్యాదుల పరిష్కారం, నివేదికల నిర్వహణ వ్యవస్థల గురించి వివరించారు. జనరల్ అబ్జర్వర్‌కు స్వాగతం పలికిన వారిలో విజయవాడ ఆర్డీవో బీహెచ్ భవానీ శంకర్, నందిగామ ఆర్వో ఎ.రవీంద్రరావు, జగ్గయ్యపేట ఆర్వో జి.వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
సాధారణ పరిశీలకులు నరీందర్ సింగ్ బాలి గారు 9154883009 నెంబర్ లో అందుబాటులో ఉంటారు.
Prajavartha Online Telugu News