-ఆంధ్రప్రదేశ్ రైతుసంఘం
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతాంగ, ప్రజా ఉద్యమాలపై నిరంకుశంగా వ్యవహరించింది. రైతాంగ నల్ల చట్టాలు తెచ్చి వాటి రద్దుకై ఆందోళనలు చేసిన రైతాంగంపై నిరంకుశంగా వ్యవహరించిన ఫలితంగా 750 మంది రైతులు బలయ్యారు. కార్పోరేట్లకు అనుకూలమైన విధానాలు కొనసాగించిన నరేంద్ర మోడీ విధానాలను ప్రజలు వ్యతిరేకించిన ఫలితంగానే ఇండియా కూటమికి అత్యధిక స్థానాలు కట్టబెట్టారు. రాష్ట్రంలో రైతాంగం రాజధాని ప్రాంతానికి స్వచ్చందంగా భూములిచ్చిన రైతులపై ఆమానుషంగా దాడులు చేయడం, రాజధాని ఊసే లేకుండా మూడు ముక్కలాటలాడటం లాంటి చర్యలతో జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా రాష్ట్రంలో మునుపెన్నడూ లేని విధంగా తిరస్కరించడం జరిగింది. అభివృద్ది నిరోధకునిగా వ్యవహరించారు. రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తిచేయ్యలేదు. ఒక్క ఎకరాకు నీళ్ళిచ్చిన పాపాన పోలేదు. పంటలకు గిట్టుబాటు ధరలు లభించలేదు. కేవలం సంక్షేమ పథకాలతోనే ఒట్లు వస్తాయని భావించిన జగన్మోహన్‌రెడ్డికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని ఆంధ్రప్రదేశ్ రైతుసంఘ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి జి. ఈశ్వరయ్య, కె.వి.వి.ప్రసాద్‌లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏర్పడబోయే నూతన ప్రభుత్వం రైతాంగ సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని వారు కోరారు.