Breaking News

జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా రాజీ మార్గంలో అవార్డుల జారీ

-ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో  కోర్టుల పరిధిలో 45 బెంచ్ లు నిర్వహణ
-ఈరోజు  సాయంత్రం 7 గంటల వరకు   1448 కేసులు పరిష్కారం చేసి అవార్డ్ లు జారీ
-ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి  / 1వ అదనపు జిల్లా జడ్జి – ఆర్ శివకుమార్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇన్సూరెన్స్, సివిల్ తగాదాలు, మోటారు వాహన ప్రమాదాల, రాజీ పడతగ్గ క్రిమినల్ కేసుల పరిష్కారం లో రాజీ పడదగిన  కేసుల పరిష్కారానికి  చొరవ చూపేందుకు ముందస్తూగా సమావేశాలు నిర్వహించి, ఆమేరకు అవార్డి ఉత్తర్వులు జారీ నేపథ్యంలో సహకారం అందించిన ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులు, ఇతర శాఖల అధికారులు, తదితరుల భాగస్వామ్యం అభినందనీయమని ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి  / 1వ అదనపు జిల్లా జడ్జి – ఆర్ శివకుమార్ తెలియ చేశారు. శనివారం స్థానిక కోర్టు ప్రాంగణంలో  జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం వారి  ఆధ్వర్యంలో జాతీయ  లోక్ అదాలత్ నిర్వహించి పలు కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి  / 1వ అదనపు జిల్లా జడ్జి – ఆర్ శివకుమార్  మాట్లాడుతూ, సుప్రీం కోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా వారి సూచనలు మేరకు రాజీ మార్గం ద్వారా కక్షి దారులకు సత్వర న్యాయం చేయాలనే లక్ష్యంతో పూర్వపు తూర్పు గోదావరి జిల్లా పరిధిలోని నాలుగు రెవెన్యూ జిల్లాల పరిధిలో ఉన్న 45 కోర్టు బెంచిల యందు జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు. గౌరవ సుప్రీం కోర్టు వారి ఉత్తర్వులు, గౌరవ హై కోర్టు వారి ఆదేశాల మేరకు ప్రతి మూడు నెలలకు ఒకసారి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతోందని అన్నారు.  మోటార్ ప్రమాదాల కారణంగా పరిహారం చెల్లింపులో ఆలస్యం నివారణ చేసే విధానం లో  లోక్ అదాలత్ నిర్వహించి కక్షి దారులకు సత్వర న్యాయం కోసం నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. తద్వారా ఇటువంటి లోక్ అదాలత్ లు ఇరు పక్షాలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. ఆమేరకు ముందుగా సమావేశం నిర్వహించి రాజీ చేయడం ద్వారా ఈరోజు ఆమేరకు అవార్డు జారీ చేశామన్నారు. అన్ని రకాలైన రాజీ పడతగ్గ కేసులను జాతీయ లోక్ అదాలత్ లో రాజీ మార్గం ద్వారా పరిహారం చెల్లించాలని అవార్డ్ ఇవ్వడం జరిగిందన్నారు . జాతీయ లోక్ అదాలత్ ద్వారా తక్షణం రాజీ చెయ్యడం వల్ల ఉభయులకు సత్వర న్యాయం జరుగుతుందని, ఇందు వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ లకు కూడా ఎంతో మేలు జరిగే అంశం అని ఆయన పేర్కొన్నారు. ప్రజల్లో, కక్షి దారుల్లో లోక్ అదాలత్ లపై మరింతగా అవగాహన పెంచి సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవడం మనందరి సామాజిక బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. ఇరు పక్షాల మధ్య రాజీ మార్గం ద్వారా ఈరోజు నిర్వహించే జాతీయ  లోక్ అదాలత్ బెంచ్ కు వొచ్చిన కేసులకు పరిష్కారం చూపి ఆమేరకు అవార్డ్ ను ప్రకటించినట్లు శివకుమార్ పేర్కొన్నారు. ఈరోజు నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ లో రాత్రి 7 గంటల వరకు 1448 పరిష్కరించిన కేసులు పరిష్కరించడం జరిగింది. అందులో  క్రిమినల్ కేసులు – 988, సివిల్ కేసులు – 370, ప్రీ లిటిగేషన్ కేసులు – 90 వెరసి మొత్తం 1448 ఉమ్మడి తూ.గో. జిల్లాలో పరిష్కారమైనది. జాతీయ లోక్ అదాలత్,   ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం ద్వారా కేసుల పరిష్కారం ద్వారా కక్షి దారులకు సత్వర  న్యాయం జరిగేలా న్యాయ మూర్తులు, కోర్టులు పనిచేస్తాయని డి ఎల్ ఎస్ ఎ కార్యదర్శి కే. ప్రకాష్ బాబు పేర్కొన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో న్యాయ మూర్తులు 1వ అదనపు జిల్లా జడ్జి ఆర్ శివకుమార్, 5వ అదనపు జిల్లా జడ్జి డి విజయ్ గౌతమ్, 8 వ అదనపు జిల్లా జడ్జి వై బెన్నయ్య నాయుడు, 9వ అదనపు జిల్లా జడ్జి ఎం మాధురి, స్పెషల్ జడ్జి ఫర్ ఎస్.పి.ఈ. అండ్ ఎసిబి కోర్టు పివిఎస్ సూర్యనారాయణ మూర్తి , బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పి. వీరేంద్రనాథ్, లాయర్లు, డి ఎల్ ఎస్ ఎ సిబ్బంది, కక్షి దారులు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు..

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *