Breaking News

రాష్ట్రంలో ఒక్కరోజే రికార్డ్ స్థాయిలో పెన్షన్ల పంపిణీ

-తొలి రోజే 95 శాతంకు పైగా పెన్షన్లు ఇంటి వద్దనే పంపిణీ
-61.76 లక్షల మంది లబ్ధిదారులకు దాదాపు రూ.4,170 కోట్ల పెన్షన్లు పంపిణీ చేసిన ప్రభుత్వం
-మొత్తంగా 65.18 లక్షల లబ్ధిదారులకు 28 కేటగిరిలో దాదాపు రూ. 4,408 కోట్ల పంపిణీకి శ్రీకారం
-సమర్థవంతమైన నాయకత్వం ఉంటే అధికారులు స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారనడానికి రికార్డు స్థాయిలో జరిగిన పెన్షన్ ల పంపిణీ ప్రక్రియే నిదర్శనం
-పెన్షన్ల పంపిణీ ప్రక్రియను విజయవంతం చేసిన సచివాలయ, ప్రభుత్వ, ఇతర ఉద్యోగులను అభినందించిన సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మంత్రి డా.కొలుసు పార్థసారథి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేడు రాష్ట్రంలో దిగ్విజయంగా సాగిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ  ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయంగా అందరూ భావిస్తున్నారని సమాచార పౌర సంబంధాలు మరియు గృహ నిర్మాణ శాఖ మాత్యులు డా.కొలుసు పార్థసారథి వెల్లడించారు. సోమవారం విజయవాడ తాడిగడప లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేడు జరిగిన వివిధ పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై మంత్రి మాట్లాడారు.

దాదాపు రాష్ట్రంలో 61.76 లక్షల మందికి ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు 12 గంటల సమయంలో దాదాపు రూ.4,170 కోట్లు పెన్షన్లుగా పంపిణీ చేశామని మంత్రి తెలిపారు. ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఒక రికార్డు అని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. గతంలో ఎన్నడూ ఇలా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ జరగలేదన్నారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైన పెన్షన్లు పంపిణీ ప్రక్రియ రాత్రి 8 గంటల వరకు రికార్డ్ స్థాయిలో పంపిణీ చేశామన్నారు.

ఒకేరోజు 95 శాతంకు పైగా పెన్షన్లు పంపిణీ జరగడం ఒక చరిత్రగా భావిస్తున్నామని మంత్రి అన్నారు. గతంలో 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉన్నప్పటికీ ఒక్కరోజులో కేవలం 85 శాతం మాత్రమే పంపిణీ చేయగలిగారన్నారు. ఇంత వేగంగా పెన్షన్ల పంపిణీ ప్రక్రియ ఏనాడూ జరగలేదన్నారు. కేవలం 1.35 లక్షల మంది సచివాలయ ఉద్యోగులతో, కేవలం 12 గంటల వ్యవధిలో ఈ రికార్డ్ సాధించామన్నారు. ఒక సమర్థ నాయకత్వం, ఆదర్శవంతమైన నాయకుడు ఉంటే ప్రభుత్వ ఉద్యోగులు ఎంత స్ఫూర్తిదాయకంగా పనిచేస్తారు, దిగ్విజయంగా పూర్తి చేస్తారు అనడానికి నేడు జరిగిన పెన్షన్ల పంపిణీ ప్రక్రియ నిదర్శనం అన్నారు..ఇంత చక్కగా పనిచేయగలిగిన వ్యవస్థ ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ మాసంలో ఉద్దేశ్యపూర్వకంగా, రాజకీయంగా బురద జల్లడం కోసం వాలంటీర్ లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయడం అసాధ్యమన్నారు.. కొంతమంది ప్రాణాలు పోవడానికి కారణం కూడా అయ్యారు.. గతంలో తాము సచివాలయ ఉద్యోగులతో పెన్షన్ పెన్షన్ల పంపిణీ ప్రక్రియ చేపట్టాలని అభ్యర్థించినప్పటికీ గత ప్రభుత్వం పెడచెవిన పెట్టిందన్నారు. చిత్తశుద్ధితో కనీస ప్రయత్నం కూడా చేయలేదని మంత్రి గుర్తు చేశారు.

పెన్షన్లు పంపిణీ ప్రక్రియలో పాల్గొన్న సచివాలయ, ప్రభుత్వ ఉద్యోగులను అభినందిస్తున్నామన్నారు. పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పండగ వాతావరణం లో జరిగేందుకు కారణమైన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. పెన్షన్లు పొందిన ప్రతి లబ్ధిదారు ఆనందంగా ఉన్నారన్నారు.ఇచ్చిన మాట ప్రకారం జులై నెలలో మొదటి రోజునే రూ.3000 కు తోడు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన బకాయిలతో కలిపి రూ.7000 లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందజేశామన్నారు..

రాష్ట్రంలోని మొత్తం 65.18 లక్షల లబ్ధిదారులకు 28 కేటగిరిలో దాదాపు రూ. 4408 కోట్ల పెన్షన్ల పంపిణీకి గాను రికార్డు స్థాయిలో పంపిణీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు . గత ప్రభుత్వం రూ.1000 పెన్షన్ పెంచేందుకు ఐదేళ్ల గడువు తీసుకుందన్నారు.. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 16 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచిందన్నారు. 35 రూపాయలతో నందమూరి తారక రామారావు పెన్షన్ ప్రారంభిస్తే 1000 కి, 2000 కి తీసుకెళ్లిన ఘనత చంద్రబాబు నాయుడుది అన్నారు. మళ్లీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కేవలం 15 రోజుల్లో 3000 నుంచి 4000 పెంచిందన్నారు. రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అనేక విజయాలు సాధించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం ఆర్థికంగా రాష్ట్రాన్ని దివాలా తీసేలా చేసింది అన్నారు.. ఆర్థికంగా భారమైనప్పటికీ ఇచ్చిన మాట ప్రకారం జులై ఒకటో తేదీనే లబ్ధిదారులకు పెన్షన్ అందచేయడం గర్వంగా ఉందని మంత్రి పార్థసారథి అన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *