Breaking News

పశువులను రోడ్లపైకి వదిలితే చర్యలు తప్పవు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజ‌య‌వాడ‌ నగర వీధులలో ఇష్టానుసారంగా పశువులను విచ్చలవిడిగా రోడ్లపైకి వదిలి వేయుట కారణంగా పారిశుధ్య నిర్వహణకు మరియు ప్రజల, వాహనముల రాకపోకలకు తీవ్ర అవరోధం కలుగుతున్న దృష్ట్యా, పశువుల యాజమానులు తమకు సంబందించిన పశువులను రోడ్లపై సంచరించకుండా చూడాలని దీనివలన వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోడ్లపైకి విచ్చలవిడిగా పశువులను వదులుతున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కమీషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ హెచ్చరించారు.

విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ కమిషనర్ ఆదేశాల ప్రకారం విజ‌య‌వాడ‌ నగర పరిధిలోని పలు వీధులలో రోడ్ల పై పశువులు సంచరించడం వలన ప్రజలకు మరియు అతిధుల రాకపోకలకు అంతరాయం కలిగించుచున్నందున, నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. బి.సోమ శేఖర్ రెడ్డి వారి అద్వర్యంలో క్యాటిల్ డ్రైవ్ కార్యక్రమము చేపట్టి పలు వీధులలో రోడ్ల పై సంచరించు పశువులను సిబ్బంది ద్వారా EXCEL ప్లాంట్ లోని క్యాటిల్ షెడ్ (బందుల దొడ్డి) నకు తరలించుట జరుగుతుందని విజ‌య‌వాడ‌ నగరపాలక సంస్థ వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. బి.సోమ శేఖర్ రెడ్డి తెలియచేసారు.

కావున ఆయా పశువుల యజమానులు నగరపాలక సంస్థ వారికీ తగిన ఆధారాలను చూపి, అపరాధ రుసుము చెల్లించి, అఫిడవిట్ సమర్పించి పశువులను తీసుకోని మీ స్వంత స్థలములో ఉంచుకోవాలని ఈ ప్రకటన ద్వారా తెలియజేయటమైనది మరియు నిర్ధేశించిన‌ గడువు లోపల పశువులను తీసుకోని వెళ్ళనిచో నగరపాలక సంస్థ వారు తగు చట్ట పరమైన చర్యలు తీసుకోనబడునని హెచ్చరించడమైనది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *