Breaking News

తాడిపూడి పంపింగ్ స్కీం ద్వారా ఆయికట్టుకు సాగునీరు విడుదల.

-ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తాం.
-రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం
-మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు

తాళ్లపూడి , నేటి పత్రిక ప్రజావార్త :
రైతు సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర జల వనరులు శాఖ మంత్రి డా. నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. బుధవారం ఉదయం తాళ్లపూడి మండలం ” తాడిపూడి పంపింగ్ స్కీం ” ఎత్తిపోతల పథకం ద్వారా ఆయకట్టు రైతాంగానికి సాగునీరు విడుదల చేసే కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ రైతులకు సాగునీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో సంతోషంగా ఉందన్నారు . రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు కెళుతుందన్నారు. గత ప్రభుత్వ హయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహణ, కాలువలలో పూడిక తీత పనులకు తగిన మరమ్మత్తులు చెయ్యకపోవడం వల్ల చివరి భూములు వరకు సాగునీరు అందించే క్రమంలో ఇబ్బందులు ఎదురైన విషయాన్ని మంత్రి ప్రస్తావించారు. రానున్న రోజుల్లో సాగు చేసే ప్రతి ఎకరాకు సజావుగా నీరు అందేలా చర్యలు చేపడతామన్నారు. తాడిపూడి పంపింగ్ స్క్రీన్ ద్వారా 14 మండలాలకు చెందిన 135 గ్రామాల్లోని రైతాంగానికి కాలువల ద్వారా 2 లక్షల 6 వేల ఎకరాలకు సాగునీటిని సరఫరా చేయడం జరుగుతుందన్నారు. ఇందులో పంపింగ్ స్కీం ద్వారా 1,38,000 ఎకరాలకు కాలువల ద్వారా సాగునీరు మెట్ట ప్రాంతంలో ఉన్న 68 వేల ఎకరాలకు సబ్ లిఫ్టుల ద్వారా సాగునీటిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మంత్రి డా. నిమ్మల రామానాయుడు స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారంతో కలిసి మంత్రి పూజాధి కార్యక్రమాలను నిర్వహించి అనంతరం తాడిపూడి ఎత్తిపోతల పథకం తాగునీటి కాలువలకు నీటిని విడుదల చేశారు. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, ఇరిగేషన్ ఎస్.ఈ. శ్యాం ప్రసాద్, ఇరిగేషన్ ఏ పి స్టేట్ అడ్వైజర్ ఎన్. వెంకటేశ్వరరావు, ఈ ఈ లు దేవ ప్రకాష్, ఏసుబాబు,  సుజాత, స్థానిక నాయకులు ఏ. త్రినాథ్, ఏ పరమేశ్వర రావు, ముళ్ళపూడి శ్రీరామమూర్తి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *