Breaking News

హోమియోపతి కాలేజీలో పిజి సీట్లు పునరుద్ధరించాలి కేంద్రమంత్రికి ఎంపీ పురందేశ్వరి విజ్ఞప్తి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) సీట్ల పునరుద్దరణ కై చొరవ చూపిన ఎంపీ , ఎమ్మెల్యే కు కృతజ్ఞతలు తెలిపిన హోమియో కళాశాల సిబ్బంది రాజమండ్రిలోని ప్రతిష్టాత్మక  అల్లు రామలింగయ్య ప్రభుత్వ హోమియో పతి  మెడికల్ కాలేజీలో  పిజి సీట్ల పునరుద్ధరించాలని  కేంద్ర ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు  జాదవ్ ని  రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు, ఆంధ్రప్రదేశ్ బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కోరారు. ఈమేరకు కేంద్రమంత్రిని కలుసుకుని   వినతిపత్రం సమర్పించారు.  కేంద్రమంత్రి  సానుకూలంగా స్పందించారని బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేస్తూ, కేంద్ర మంత్రికి  కృతజ్ఞతలు తెలిపారు. ఈ విషయములో కేంద్ర ఆయుష్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి ప్రతాప్ రావు గణపతిరావు  జాదవ్ తప్పకుండా సానుకూలంగా స్పందించి తగిన ఉత్తర్వులు జారీ చేస్తారన్న ఆశాభావాన్ని ఎంపి పురందేశ్వరీ వ్యక్తం చేశారు. డాక్టర్ A.R.లో టీచింగ్ స్టాఫ్ లేకపోవడంతో 2024-25 విద్యా సంవత్సరానికి 23 పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్ల (3 స్పెషాలిటీలలో) ప్రవేశానికి ఎన్ సి హెచ్, న్యూ ఢిల్లీ అనుమతి నిరాకరించిందన్నారు. ప్రభుత్వం హోమియో మెడికల్ కాలేజ్ & హాస్పిటల్, రాజమహేంద్రవరం తరపున ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి, రాజమండ్రీ అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా ఆయన వెంటనే స్పందించిన ఎంపి దగ్గుబాటి పురంధేశ్వరి, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ లకు కళాశాల తరపున కృతఙ్ఞతలు తెలియచేసారు.. కళాశాలకు కావాల్సిన పీజీ సీట్లు కల్పిస్తామని కేంద్ర ఆయుష్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి హామీ తెలపడం , సానుకూలంగా స్పందించడం. పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్, సిబ్బంది & విద్యార్థులు ఈ సందర్భంగా ఎంపి , ఎమ్మెల్యే వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *