Breaking News

నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిందాలి…

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2023 డిసెంబర్ లో జరిగిన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్ పరీక్షలో ఎంపిక అయిన విద్యార్థులు ఈ సంవత్సరం తప్పకుండా 31 ఆగస్ట్ 2024 లోపు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను సమర్పిందాలని, 2020, 2021 మరియు 2022 సంవత్సరాలలో ఎంపిక అయిన విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకొనవలెను అనియు కేంద్ర మానవ వనరుల శాఖ, న్యూ ఢిల్లీ వారు తెలియజేసినట్లు జిల్లా పాఠశాల విద్యాధికారి కె. వాసుదేవ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలియ చేశారు. మార్పులు చేయబడిన హోమ్ పేజీ, కొత్త మొబైల్ యాప్ మరియు అప్డేట్ చేయబడిన వెబ్ వెర్షన్ తో కూడిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) అప్లికేషన్ ప్రారంభించబడి www.scholarships.gov.in నందు One Time Registration (OTR) అనే పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగినది. తాజా మరియు పునరుద్ధరణ దరఖాస్తుల సమర్పణ కోసం నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) లో OTR అవసరం. OTR మాడ్యూల్ ఏడాది పొడవునా విద్యార్ధులకు అందుబాటులో ఉంటుంది. OTR అనేది ఆధార్ / ఆధార్ ఎన్రోల్మెంట్ ID (EID) ఆధారంగా జారీ చేయబడిన ప్రత్యేకమైన 14 అంకెల సంఖ్య. NSPలో స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేయడానికి OTR అవసరం. OTR ప్రక్రియని విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, విద్యార్థి యొక్క మొత్తం విద్యా జీవితచక్రం (చదువుకున్నంత కాలం) కోసం చెల్లుబాటు అయ్యే OTR ID జారీ చేయబడుతుంది. NSP లో 2024-25 కోసం విద్యార్థులు NMMS కోసం తాజా/ పునరుద్ధరణ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేది 30-08-2024. స్కూల్ నోడల్ ఆఫీసర్ (INO) లెవెల్ లో ఆమోదించుటకు చివరి తేది 15-09-2024 మరియు జిల్లా నోడల్ ఆఫీసర్ (DNO) లెవెల్ లో 30-09-2024. One Time Registration (OTR) సంబంధించిన పూర్తి వివరములు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ (NSP) లేదా ప్రభుత్వ పరీక్షల కార్యాలయ వెబ్సైట్ www.bse.ap.gov.in లో పొందగలరు. గత సంవత్సరాలలో వలెనే విద్యార్ధి వివరములు ఒక్క అక్షరం కూడా తేడా లేకుండా మెరిట్ లిస్ట్ లో ఉన్న విధంగానే ఆధార్ లో ఉండేవిధంగా సరిచూసుకుని పోర్టల్ నందు తమ వివరములు నమోదు చేసుకొనవలెను. అదేవిధంగా మెరిట్ లిస్ట్ లో ఉన్న విధంగానే ఆధార్ కార్డ్ పైన లేని విద్యార్థులు వెంటనే ఆధార్ మరియు బ్యాంక్ పాస్ బుక్ లలో సరిచేయించు కొనవలెను. మెరిట్ లిస్ట్ లో ఉన్న వివరములే తప్పుగా ఉన్న యెడల వెంటనే సంబంధిత స్కూల్ వారి ద్వారా సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయంలో ఆధార్ అసమతుల్యత (Mismatch) వివరములను ఇవ్వవలెను. విద్యార్థి పేరు, పుట్టిన తేదీ, తండ్రి పేరు ఒక్క అక్షరం తేడా ఉన్నా కూడా Mismatch Proforma (Excel) సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి వారి కార్యాలయములో ఇవ్వవలెను మరియు ఆధార్ Mismatch proforma ప్రధానోపాధ్యాయులు వారి Whatsapp గ్రూప్ లలో పంపియున్నారు. ప్రతి విద్యార్థి తన బ్యాంక్ ఖాతా ను తన ఆధార్ నెంబర్ కు సిండింగ్ చేయించుకొని DBT ద్వారా డబ్బులు జమ అయ్యేవిధంగా ఏర్పాటు చేసుకొనవలెను. లేని యెడల స్కాలర్షిప్ జమ కాదు. ఈ పథకం యొక్క విధి విధానాలు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ నందు పొందగలరు. విద్యా మంత్రిత్వ శాఖ, న్యూ ఢిల్లీ వారు నిర్దేశించిన గడువులోపు ఈ ప్రక్రియ పూర్తి చేయని విద్యార్థు లకు స్కాలర్ షిప్ మంజూరు కాదు. దానికి విద్యార్థి తల్లితండ్రులు మరియు సంబంధిత పాఠశాలవారే బాధ్యత వహించవలసి ఉంటుంది అని కె. వాసుదేవరావు, జిల్లా పాఠశాల విద్యాశాఖాదికారి, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం, వారు తెలియచేసియున్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *