Breaking News

ఘనంగా అల్లూరి సీతా రామరాజు 127 వ జయంతి వేడుకలు

– తెగువ పోరాట పటిమ నుంచి స్ఫూర్తి పొందాలి
-అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం
– పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి సదా ప్రాతః స్మరణీయుడు అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అటువంటి మహనీయుల నుంచి స్ఫూర్తి పొందడం ద్వారా రాష్ట్ర అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపు నిచ్చారు. గురువారం ఉదయం స్థానిక గోదావరి బండ్ పై ఉన్న అల్లూరి సీతారామరాజు 127 వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి కలెక్టర్ ప్రశాంతి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బల రామకృష్ణ తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సంధర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు హాజరైన ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియ చేశారు. ఈ వేడుకలను ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట స్థాయి వేడుకలుగా జరిపించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ లకి ప్రత్యేక కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ, కృతఙ్ఞతలు తెలిపారు. భారతదేశానికి స్వేచ్చా స్వాతంత్ర్య లు లేని సమయంలో దేశా స్వతంత్రం కోసం పోరాడిన ఎందరో పోరాట యోధులలో అగ్రగణ్యుడు అల్లూరి అన్నారు. ఈ నెల నాది, ఈ భూమి నాది అని పోరాడి స్వాతంత్ర పోరాట స్ఫూర్తి తీసుకుని వొచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. స్వతంత్రం నా జన్మ హక్కు అని ఆచరణలో చూపిన వ్యక్తి అల్లూరి అన్నారు. అతివాదం ఉండాలని సాయుధ పోరాట కు చైతన్యం తీసుకుని, ప్రాతః స్మరణీయుడు అల్లూరి అన్నారు. అదే స్ఫూర్తి ని ముందుకు తీసుకుని వెళ్లే గొప్ప సంకల్పంతో , రాష్ట్ర అభివృద్ది కోసం మనందరం పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అల్లూరి తెగువ పోరాట పటిమ నుంచి యువత స్ఫూర్తి స్ఫూర్తి పొందాలని పిలుపు నిచ్చారు. అల్లూరి జన్మదిన వేడుకల్లో పాల్గొనడం అదృష్టం గా మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు.
జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, అల్లూరి సీతారామ రాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు గొప్ప స్ఫూర్తి వంతమైన రోజు అన్నారు. ఆక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతి రాష్ట్ర వేడుకగా జరిపించడం అభినందనీయం అన్నారు. అల్లూరితో ఈ ప్రాంతం వాసులకు ప్రత్యేక అనుబంధం ఉండడం ఒక అదృష్టం అన్నారు. భీమవరం లో 125 వ అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరయ్యారు. ఆయన స్ఫూర్తి భవిష్యత్తు కు తీసుకుని వెళ్లే బాధ్యత మనందరిపై ఉందన్నారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, బ్రిటిష్ వారి గుండెల్లో నిద్రపోయిన వ్యక్తి అల్లూరి మన ప్రాంతం వ్యక్తి అన్నారు. సాయుధ పోరాటం ద్వారా స్వాతంత్ర్యం సాధ్యం అని నమ్మి ప్రాణాలు అర్పించిన గొప్ప స్వాతంత్ర్య పోరాట యోధుడు అల్లూరి సదా స్మరణీయుడు అన్నారు. అల్లూరి జీవిత చరిత్రను అందరికీ తెలియ చేసిన స్వర్గీయ పడాల రామారావు, ఆయన కుమార్డు వీరభద్ర రావులను స్మరించుకోవడం సముచితం అన్నారు. బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ, అల్లూరి పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకు అందించే విధంగా జన్మ దిన వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ, ఆయనకు ఘన నివాళి అర్పించడం జరిగిందన్నారు. మునిసిపల్ కమీషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ, అల్లూరి జీవిత చరిత్ర నుంచి ఎంతో నేర్చుకోవలసి ఉందన్నారు. రాష్ట్ర స్వాతంత్ర్య పోరాట చరిత్రలో పప్రథంగా వినిపించే పేరు అల్లూరి అన్నారు. శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, బత్తుల బలరామకృష్ణ , మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్, ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, టూరిజం జాయింట్ డైరెక్టర్ వి. స్వామీ నాయుడు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *