Breaking News

కువైట్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేత మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
కువైట్ అగ్ని ప్రమాదం లో మరణించిన కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి చేరో ఐదు లక్షల ఆర్ధిక సహాయాన్ని అందించి భరోసా కల్పించడం జరిగిందని రాష్ట్ర పర్యటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు గురువారం స్థానిక గోదావరి బండ్ వద్ద నిర్వహించిన అల్లూరి జయంతి వేడుకల సందర్భంలో బాధిత కుటుంబ సభ్యులకు మంత్రి చెక్కును అందచేశారు. ఈ సంధర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఇటివల కువైట్ దేశంలో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన జిల్లాకు చెందిన ముల్లేటి సత్యనారాయణ , మీసాల ఈశ్వరుడు కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా కలిసి, మృతులకి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. జూన్ 12 న కువైట్ లోని ఏడు అంతస్తుల భవనంలో ని వంట గదిలో జరిగిన ప్రమాదంలో మృత్యు వాత పడినట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి మనోధైర్యం కల్పించాలని పేర్కొనడం జరిగిందని , వారి ఇంటికి స్వయంగా వెళ్ళి పరామర్శించి , ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చామన్నారు. ఇచ్చిన హామీకి కట్టుబడి బాధిత కుటుంబాలకు చేరో ఐదు లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరు చేసిన చెక్కులని అంద చేశామన్నారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని ఆకుటుంబాలని మంత్రి భరోసా కల్పించడం జరిగింది. ఈ సంధర్భంగా ముల్లేటి సత్యనారాయణ సతీమణి అనంతలక్ష్మి తరఫున కుమారుడు వెంకట సాయి కి , మీసాల ఈశ్వరుడు భార్య చిట్టి కాసులకి మంత్రి కందుల దుర్గేష్ , కలెక్టర్ పి. ప్రశాంతి, శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ల చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల చెక్కును అందచేసారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ , మంత్రి కందుల దుర్గేష్ కు బాధిత కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *