Breaking News

 దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న  తొలి రోజుల్లోనే మనకు నాయకత్వం వహించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు

– అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణంలో నిర్వహించడం అభినందనీయం
-పర్యాటక సాంస్కృతిక  సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి  కందుల దుర్గేష్

నిడదవోలు, నేటి పత్రిక ప్రజావార్త :
బానిస సంకెళ్లతో ఉన్న భారతదేశ ప్రజలకు స్వేచ్ఛ వాయువుల ప్రసాదించాలనే లక్ష్యంతో, దేశానికి స్వాతంత్రాన్ని తీసుకురావాలన్న ప్రారంభించిన తొలి రోజుల్లోనే మనకు నాయకత్వం వహించిన నాయకుడు అల్లూరి సీతారామరాజు అని వారి జయంతి ఉత్సవాల్లో పాల్గొని నివాళులర్పించడం తన అదృష్టంగా భావిస్తున్నారని పర్యాటక సాంస్కృతిక సినిమా ఆటోగ్రాఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. గురువారం స్థానిక గాంధీ నగర్ సెంటర్లో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి మంత్రి కందుల దుర్గేష్ స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులతో కలిసి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ మన్యంలో ఉన్నటువంటి గిరిజనుల సమస్యల అర్థం చేసుకొని వాటిని పరిష్కరించే దిశగా బ్రిటిష్ ప్రభుత్వంతో పోరాటం చేసిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అతివాదం,మితవాదం అనే రెండు భావజాలాలతో నాయకులు ఇచ్చేవారు అన్నారు. మితవాదం అనేవారు సాయుధ పోరాటాలు సరైన విధానం కాదు అహింస ద్వారానే స్వతంత్రాన్ని సంపాదించుకోవాలని గోపాలకృష్ణ గోకిలే, మహాత్మా గాంధీ వంటి వారు ముందుకు నడవగా, బ్రిటిష్ వారిని పారద్రోలాలంటే వారితో పాటు సమానమైన శక్తి సామర్థ్యాలు మనకు ఉండాలని అతివాదం మార్గాన్ని సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, బాలగంగాధర్ తిలక్ వంటి నాయకులు ఎన్నుకొని ముందుకు నడిచారని మంత్రి అన్నారు. భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామిక గణతంత్ర దేశంగా ప్రపంచ దేశాల ముందు నిలపాలనదే ఆ మహనీయుల ధ్యేయంగా పేర్కొన్నారు. మన ప్రాంతమైన ఉభయగోదావరి జిల్లాలు, విశాఖపట్నంకు చెందిన అల్లూరి సీతారామరాజు మన్యం ప్రజల సమస్యలను పోరాట స్ఫూర్తితో ఆదుకోవాలని లక్ష్యంగా సాయుధ పోరాటాన్ని ఎంచుకొని గిరిజనులకు అండగా నిలిచి వారిని బలోపేతం చేశారన్నారు. ఇదే క్రమంలో వారికి మనోధైర్యాన్ని అందించే విధంగా పోలీస్ స్టేషన్ల పై దాడి చేసి ఆయుధ సామాగ్రిని తీసుకొని గిరిజనులకు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొనే మనోధైర్యాన్ని కలిగించారన్నారు. ఆయన జీవించిన కాలం కేవలం 27 సంవత్సరాలు మాత్రమేనని అయినప్పటికీ ఆయన పేరు శత సహస్ర వసంతాలపాటు నిలిచేలా పోరాట ఉద్యమం చేసిన నేతని మంత్రి పేర్కొన్నారు. అటువంటి మహానేతను ప్రాతఃస్మరణీయులని అంటామన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర ప్రభుత్వం పండుగ వాతావరణం లో చేస్తుందని, ఆయన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు నడవాలని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రవి అస్తమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొని నిలబడిన భారతదేశ మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు అని మంత్రి అన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం సమాజంలోని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తుందన్నారు. అనంతరం మంత్రి కందుల దుర్గేష్ వంగవీటి మోహన రంగా విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వంగవీటి మోహన రంగా ఏ ఒక్క వర్గానీకో, కులానికో , మతానికో పరిమితమైన వ్యక్తి కాదని అన్నారు. పేద ప్రజల పక్షపాతిగా వార్డు స్థాయి నుంచి శాసనసభ్యుగా నిరంతరం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పేద ప్రజల అభ్యున్నత కొరకు కృషి చేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *