Breaking News

నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో శానిటేషన్, త్రాగునీరు, డ్రైన్లు ప్రత్యేక దృష్టి.

-ఆదిశగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సత్యం చేయాలి.
– ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వ జూలై మాసంలో లబ్ధి దారులకు రు. 7 వేల రూపాయలు పెన్షన్ అందించాం.
– రైతు సంక్షేమమే లక్ష్యంగా  వారి కొరకు రు. 1000 కోట్లు  ప్రభుత్వ రిలీజ్ చేయడం జరిగింది.
-గత ప్రభుత్వ బకాయిలను కూడా రైతులు అందిస్తాం.
-త్వరలో రాష్ట్ర ప్రభుత్వం 16 వేల మంది ఉపాధ్యాయులు పోస్టులను భర్తీ చేయనుంది.
-రూరల్ నియోజకవర్గం శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి

రాజమండ్రి , నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం పరిధిలోగల అన్ని గ్రామాల్లో కార్యచరణ ప్రణాళికతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడమే ప్రధాన లక్ష్యమని ఆ దిశగా సత్వర చర్యలు చేపడుతున్నట్లు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి పేర్కొన్నారు శుక్రవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయ మందిరంలో మండల స్థాయి అధికారులుతో నియోజకవర్గంలో చేపట్టవలసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై శాసనసభ్యులు బుచ్చియ్య చౌదరి సమీక్షించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో మెరుగైన శానిటేషన్ కార్యక్రమాలు ఎంతో అవసరం అని ఆ దిశగా పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టి అమలు చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వృద్ధాప్య వికలాంగు, వితంతు వంటి ఇతర పెన్షన్లకు కూడా గత మూడు నెలల బకాయిలతో కలిపి జూలై మాసం లో సచివాలయ ఉద్యోగులకు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే రు. 7000 రూపాయలు పెన్షన్ ప్రభుత్వం అందించింది అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు, పెన్షనర్లకు ఒకటో తేదీనే జీతాన్ని వారి ఖాతాలకు జమ చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో త్రాగునీరు సౌకర్యం కల్పించే దిశగా దాదాపు ప్రతి గ్రామంలో దాతల సహకారంతో వాటర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయడం జరిగిందని, అయితే గత ప్రభుత్వం వాటిని సంరక్షించకుండా నిర్వీర్యం చేశాయని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ రైతు సంక్షేమమే లక్ష్యంగా వారి కొరకు రు. 1000 కోట్లు ప్రభుత్వ రిలీజ్ చేయడం జరిగిందన్నాసారు. అదేవిధంగా గత ప్రభుత్వం రైతులకు అందించవలసిన రు. 630 కోట్లు కూడా ఈ ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గత ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసినందున ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రు. 12 లక్షల 30 వేల కోట్లు అప్పులో ఉందని ఆయన అన్నారు. నూతనంగా రాష్ట్రంలో 16 వేల మంది ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసుకుంటున్నా మన్నారు. గత ప్రభుత్వ విధానం వలన పాఠశాల వ్యవస్థ నిర్వీర్యమై డ్రాప్స్ సంఖ్య పెరిగింది అన్నారు. అర్హులైన లబ్ధిదారులందరికి సకాలంలో ప్రభుత్వ పథకాల లబ్ధిని చేకూర్చే విధంగా సచివాలయ ఉద్యోగులు విధులు నిర్వహించాలన్నారు. తాను సచివాలయాలను సందర్శించి ఉద్యోగులతో మాట్లాడి ప్రభుత్వ విధి విధానాల ద్వారా ప్రజలకు చేకూర్చే కార్యక్రమాలపై సమీక్ష చేస్తానని తెలిపారు. జలజీవన్ పథకం ద్వారా రక్షిత మంచినీటి పత్తి గ్రామానికి లక్ష్యం ఉన్నప్పటికీ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన కొంతమూరు, కాతేరు, ధవలేశ్వరం వంటి గ్రామాలకు త్రాగునీరు కొరత ఏర్పడడం జరిగిందన్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సంబంధించి కాలువలు పూడికతీత, అంతర్గత రహదారులు, డ్రైన్స్ మరమ్మత్తు పనులను ఆయా గ్రామాలకు సంబంధించి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని శాసనసభ్యులు గోరంట్ల బుచ్చియ్య చౌదరి అధికారులకు సూచించారు. గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం వలన అభివృద్ధి కొంటుపడిందన్నారు. ప్రతి గ్రామంలో శానిటేషన్, త్రాగునీరు, మురుగు నీరు పారుదల డ్రైన్లు అత్యంత ప్రాధాన్యతమైన వని ప్రత్యేక దృష్టిని సారించడం జరుగుతుందని శాసనసభ్యులు ఈ సందర్భంగా తెలియజేశారు. సమీక్షా సమావేశంలో మండల ప్రత్యేక అధికారి కె జ్యోతి, డి ఎల్ డి ఓ పి. వీణాదేవి, ఎంపీడీవో శ్రీనివాస్, మండల స్థాయి అధికారులు, స్థానిక నాయకులు వాసుదేవ్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *