Breaking News

వ్యవసాయ ప్రాథమిక రంగంపై సమీక్షా కలెక్టర్ ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యయసాయ అనుబంధ రంగాల్లో ప్రభుత్వ మార్గదర్శకాలు మేరకు కార్యాచరణ సిద్ధం చేసుకుని ఆచరణ లో చూపాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో వ్యయసాయ , అనుబంధ ప్రాథమిక రంగాల పురోగతి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ అనుబంధ రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, మార్గదర్శకాలు జారీ చెయ్యడం జరిగిందన్నారు. ఆయా మార్గదర్శకాలు మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్వహించే సమీక్ష సమావేశాలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాల్సి ఉందన్నారు. వ్యయసాయ రంగం కి చెంది రానున్న ఖరీఫ్ సీజన్ ముందస్తు ఏర్పాట్లు పై సమీక్ష చేశారు. ఇప్పటికే సాగునీరు విడుదల చెయ్యడం జరిగిందని, ఆయా ప్రాజెక్ట్ ల దిగువ న ఉన్న సాగు లక్ష్యాలను నూరుశాతం పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 77,817 హెక్టార్ల లో సాగు లక్ష్యం కాగా ఇప్పటికే 17,878 ఎకరాల్లో నాట్లు (23 శాతం) పూర్తి అయినట్లు తెలిపారు. నాట్లు వేసేందుకు విత్తనాలు పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నాయని, రైతూ రైతూ మధ్య సుమారు 29 వేల క్వింటాళ్ల, ప్రవేటు వ్యక్తుల ద్వారా సుమారు 10 వేల క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. సాయిల్ టెస్ట్ సంబంధించి 75 శాతం లక్ష్యాలకు గానూ 84 శాతం పురోగతి సాధించినట్లు తెలిపారు. అవసరమైన ఎరువులు లభ్యత ఉన్నట్లు తెలిపారు. ఎరువులను ప్రభుత్వ గోడౌన్ లలో భద్రపరిచేలా చర్యలు తీసుకోవాలని, ఆమేరకు ఖర్చులను తగ్గించే అవకాశం ఉందని తెలిపారు. మత్స్య రంగం, ప్రకృతి వ్యవసాయం, హార్టికల్చర్ సాగు విస్తీర్ణం , నీటి వసతులు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు, ఏపీ ఎమ్ ఐ పి అధికారి ఏ. దుర్గేష్, జిల్లా మార్కెటింగు ఏ డీ ఎమ్ సునీల్ కుమార్, జిల్లా మత్స్య అధికారి వి కృష్ణారావు, హార్టికల్చర్ అధికారి శ్రీనివాసులు, ప్రకృతి వ్యవసాయ అధికారి తాతారావు లు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *