Breaking News

సహకార వ్యవస్థ నిర్వీర్యం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి … ఫణి పేర్రాజు, సురేష్ నాయుడు

-రాష్ట్ర అభివృద్ధిలో సహకార శాఖ ఉద్యోగులు ప్రభుత్వానికి అన్ని విధాల అండగా ఉంటాం… ఫణి పేర్రాజు మరియు సురేష్ నాయుడు
-కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ గా జి. సురేష్ నాయుడు ఎన్నిక… ఫణి పేర్రాజు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈరోజు ఏపి కో ఆపరేటివ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు ఫణి పేర్రాజు అధ్యక్షతన విజయవాడలో సహకార భవన్ నందు జరిగినది. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు 26 జిల్లాలు మరియు కమిషనర్ కార్యాలయం యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఏర్పాటైన నూతన ప్రభుత్వానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తూ ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. అదేవిధంగా సహకార ఉద్యోగులు ఎల్లవేళలా రాష్ట్ర పురోభివృద్ధికి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని తీర్మానం ద్వారా తెలియచేశారు. ఈ సమావేశంలో, గత నెలలో పదవీవిరమణ పొందిన జనరల్ సెక్రటరీ స్థానంలో కొత్త జనరల్ సెక్రటరీ గా గుంటూరు జిల్లాకు చెందిన జి.సురేష్ నాయుడు ఎన్నికయ్యారు. అదే విధంగా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ప్రకాశం జిల్లా నుండి కె. వెంకటేశ్వర్లు, జోనల్ సెక్రటరీ గా అన్నమయ్య జిల్లాకు చెందిన ఎం. శ్యాంప్రకాష్ రెడ్డి, వైస్ ప్రసిడెంట్ లుగా రాజమహేంద్రవరం కి చెందిన వి.సత్యనారాయణ. హెడ్ ఆఫీస్ కి చెందిన కె శివయ్య సెక్రటరీలుగా హెడ్ ఆఫీస్ కి చెందిన కె.రాజు మరియు అనకాపల్లి జిల్లా కు చెందిన బి. గీతావాణి మరియు కేడర్ సెక్రటరీలుగా కె.సుభాష్ చంద్ర అజాద్ , జి. హుస్సేన్ భాషా ఎన్నికైనారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు ఫణి పేర్రాజు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు నడుస్తుందని దానికి సహకార శాఖ ఉద్యోగులందరూ అన్ని విధాలా తోడ్పాటు అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న విధానాలు వలన క్షేత్రస్థాయిలో సహకార ఉద్యోగులు తీవ్రమైన ఒత్తిడికి గురువడమే కాకుండా ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడవలసి వచ్చిందని జగనన్న పాలవెల్లువ పథకానికి సంబంధించి ఉదయం 6 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు సహకార ఉద్యోగులను ఇబ్బంది పెట్టడమే కాకుండా నెలకి 15 నుంచి 20వేల రూపాయలు ప్రయాణ ఖర్చులకు7 జీతం నుండి చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిన ఏర్పడింది అని ఒక్క రూపాయి కూడా TA బిల్లులు చెల్లించడం కానీ రవాణా సదుపాయం కల్పించడం గానీ చేయలేదని అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినా ఎన్సీడీసీ నుండి రాష్ట్రానికి వచ్చిన 139 కోట్ల ICDP ఫండ్స్ జిల్లాలకు విడుదల చేయకుండా ఆ పథకం కింద పనిచేసే ఉద్యోగులకు 22 నెలలు జీతాలు చెల్లించకుండా ఆపేసారని వాపోయారు.

ఈ సమావేశంలో గత 5 సంవత్సరాలుగా ఉద్యోగులకు జరిగిన ఇబ్బందులు మరియు గత ఐదు సంవత్సరాలుగా పరిష్కారం కాని ఉద్యోగుల సమస్యలు సహకార శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని, అదేవిధంగా రాష్ట్రప్రభుత్వం నిర్వీర్యం అవుతున్న సహకార రంగాన్ని మళ్లీ పునరుద్ధరించేలా తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

అదేవిధంగా మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఉద్యోగుల ఓట్ల విలువను తెలియజెప్పి ఉద్యోగులందరికీ చేత పోస్టల్ బ్యాలెట్లు వేయడానికి మరియు ఎన్నికల కమిషన్ తో ఎప్పటికప్పుడు సంప్రదించి పోస్టల్ బ్యాలెట్ గడువు పెంచడానికి కృషి చేసి ఉద్యోగుల హక్కులను కాపాడటానికి నిర్విఘ్నంగా పనిచేసిన ఏపి జెఎసి అమరావతి చైర్మన్ బొప్పరాజు మరియు సెక్రటరీ జనరల్ పలిసెట్టి దామోదర రావు మరియు కార్యవర్గ సభ్యులకు ధన్యవాదాలు తెలియచేశారు.

ఈ సమావేశంలో ఇప్పటివరకు జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహించిన కె భావన ఋషి, కోశాధికారి కోటేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు.

Check Also

యధావిధిగా సెప్టెంబరు 23 సోమవారం “పీజీఆర్ఎస్ ‘మీ కోసం”

-జిల్లా కలెక్టర్ ప్రశాంతి రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ప్రతి సోమవారం నిర్వహించే ప్రజల నుంచి అర్జీలను స్వీకరించే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *