-ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి
-జిల్లా కలెక్టర్ డా.జి.సృజన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జూలై 8 వ వ తేదీ సోమవారం కలెక్టరేట్ లోని పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం)కార్యక్రమం ద్వారా ప్రజల నుండి వినతులు స్వీకరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డా. జి. సృజన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (పీజీఆర్ఎస్) ద్వారా చేపట్టనున్నట్టు తెలిపారు. *కలెక్టరేట్, డివిజన్, మునిసిపల్, మండల కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1గంట వరకు ప్రజలకు అందుబాటులో ఉండి అర్జీలు స్వీకరిస్తారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు, డివిజన్, మండల కేంద్రాలు, మునిసిపల్ కార్యాలయాల్లో కూడా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం జరుగుతుందని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డా.జి.సృజన ఆ ప్రకటనలో కోరారు.