Breaking News

ఉచిత ఇసుక పాలసీ విధానాన్ని ప్రారంభించిన శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు, సబ్ కలెక్టర్ శ్రీవాత్సవ

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సామాన్యులకు ఇసుక అందుబాటులో తీసుకుని రావడం లో లాంఛనంగా ఈరోజు ప్రారంభించడం జరిగిందని శాసన సభ్యులు ముప్పిడి వెంకటేశ్వర రావు పేర్కొన్నారు.

మంగళవారం సాయంత్రం కుమార దేవరం గ్రామంలో ఇసుక స్టాక్ పాయింట్ వద్ద ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ, కూటమి నాయకులతో కలిసి శాసనసభ్యులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, కొవ్వూరు నియోజక వర్గ పరిథిలో ఇళ్లను నిర్మించుకునే వినియోగదారులకి ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ఉచితంగా ఇసుక పంపిణీ ద్వారా అందుబాటులోకి తీసుకొని రావడం జరుగుతుందన్నారు. గత ఐదు సంవత్సరాలుగా పేద నిరుపేద కుటుంబాలు ఇళ్ల నిర్మాణం కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనడం జరిగిందన్నారు. నేడు ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లకి పేద ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు. వాస్తవ లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా ఇసుక పాలసీ విధానాన్ని అమలు చేయడానికి మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న, ఆనాడు ఉచిత ఇసుక పాలసీ అమలు చేసినా సందర్భాన్ని ఎమ్మెల్యే గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాల కాలంలో గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 13 లక్షల కోట్ల మేర అప్పులు పాలుచేయడం చూసారని పేర్కొన్నారు. అయితే ఎన్నికల హామీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ మూడు నెలల హామీ 3 వేలు, జూలై నెల పెన్షన్ 4 వేలు వెరసి రూ.7 వేలు ఇచ్చి హామీ అమలు చేశామన్నారు. అదే విధంగా ఉచిత ఇసుక హామీ నేటి నుంచి అమలు చేసినట్లు పేర్కొన్నారు. టన్ను ఇసుక ధర ₹.275 నిర్ణయించినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా సబ్ కలెక్టరు అశుతోష్ శ్రీవాత్సవ మాట్లాడుతూ, ఒక వ్యక్తికి 20 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచిత ఇసుక పాలసీ విధానంలో ప్రజలకి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగిందన్నారు. ప్రజలు మార్గదర్శకలను ఖచ్చితంగా పాటించి ప్రభుత్వం నిర్దేశించిన సూచనలు పాటించి, అధికారులకి సహకరించాలని కోరారు. తగిన ఆధారాలు అందచేసి ఈ పథకం యెుక్క ప్రయోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

ఈ కార్యక్రమంలో టుమెన్ కమిటీ సభ్యులు, స్ధానిక కూటమి నాయకులు జొన్నలగడ్డ చౌదరి , కంఠమణి రామకృష్ణ సూరపనేని చిన్ని , వట్టికూటి వెంకటేశ్వర రావు , నామన పరమేష్ , దాయిన రామకృష్ణ , కాకర్ల నారాయుడు , టీవీ రామారావు , బోడపాటి ముత్యాలరావు, గురజాల సురేష్, స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు,

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *