Breaking News

మద్యం అక్రమ రవాణా, అక్రమ నిల్వ, సారా అమ్మకాలు జరగకుండా అధికారులు అప్రమత్తంగా తనిఖీలు నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులు మద్యం అక్రమ నిల్వలు, కల్తీ మద్యం, సారా విక్రయం జరగకుండా నివారణ, నియంత్రణ చర్యలు చేపడుతూ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని ఎట్టి పరిస్థితిలోనూ ఉల్లంఘనలకు తావివ్వరాదని జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ ఆదేశించారు.

మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ, సెబ్ అధికారులతో కలెక్టర్ మద్యం అమ్మకాలపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ మద్యం అక్రమ నిల్వలు, అక్రమ సారా అమ్మకాలపై దృష్టి పెట్టి నివారణ, నియంత్రణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ శాఖ అధికారి జానకి రామ్ వివరిస్తూ జిల్లాలోని తిరుపతి, ఓజిలి డిపోల నుండి 24 వాహనాల ద్వారా రవాణా చేస్తున్నామని వాటికి జిపిఎస్ ఏర్పాటు ఉన్నాయని, 240 ప్రభుత్వ మద్యం దుకాణాలకు, లైసెన్స్ పొందిన బార్లకు సరఫరా చేస్తున్నామని తెలిపారు. మిథనాల్ యూనిట్లు 32 ఉన్నాయని తెలుపగా వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. గాజుల మాండ్యం వద్ద గల ఎస్విఆర్ డిస్టిలరీ వివరాలు కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

జిల్లా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారి రాజేంద్ర వివరిస్తూ 2023 సం.కు గానూ 102, 2024 సం. కు గాను జూలై 8 వ తేదీ వరకు 950 కేసులు వెరసి మొత్తం 1052 డిపీఎల్ కింద బుక్ చేయడం జరిగిందని తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ కార్యక్రమం కొనసాగిస్తున్నామని తెలిపారు.

ఈ సమావేశంలో ఓజిలి డిపో మేనేజర్ ఇంఛార్జి నాగ మల్లేశ్వర్ రెడ్డి హాజరైనారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *