Breaking News

కడియం నర్సరీ లను ఇకో – టూరిజంగా అభివృద్ది దిశగా అడుగులు

-పర్యాటక శాఖ ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తాం
-నర్సరీ యాజమాన్యాలతో కలెక్టర్ పి. ప్రశాంతి సమావేశం

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పుగోదావరి జిల్లాకు ప్రత్యేక ఆకర్షణగా, తనదైన గుర్తింపు పొందిన కడియం నర్సరీ ప్రాంతాన్ని ఈకో టూరిజం ప్రాజెక్టు కింద అభివృద్ధి చేయడానికి నర్సరీ యజమాన్యాలు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియ చేసారు. గురువారం సాయంత్రం స్థానిక కలెక్టర్ ఛాంబర్ లో నర్సరీ యాజమాన్యాలతో, అసోసియేషన్ ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ పి . ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాకు చెందిన మంత్రి పర్యాటక శాఖ మంత్రిగా బాధ్యత నిర్వహించడం, ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి మనకు ఒక చక్కటి అవకాశం అని పేర్కొన్నారు. కడియం నర్సరీ ప్రాంతాలలో ” ఈకో టూరిజం” కింద అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతానికి మరింత మంది పర్యాటకులను ఆకర్షించేలాగా నర్సరీ యాజమాన్యాలు నిర్దిష్టమైన ప్రణాళికలతో ముందుకు రావాలని తెలియజేశారు. అందులో భాగంగా ఒకే రకమైన తోటల మధ్య నుంచి వివిధ రకాల మొక్కల తో కూడిన నర్సరీల మధ్య రహదారులను ఏర్పాటు చేసి , వాకింగ్ ట్రాక్ ద్వారా ఒకదానికి ఒకటి అనుసంధానం చేస్తూ పర్యాటకులకు ఒక ఆసక్తికర ప్రదేశంగా తీర్చి దిద్దాల్సి ఉందన్నారు. ముఖ్యంగా పర్యాటకులకు అహల్లాదకరమైన వాతావరణంలో గడిపేలాగా సదుపాయాలను కల్పించాల్సి ఉంటుందన్నారు. రిసార్ట్స్ ఫుడ్ కోర్టు, కాపీ షాపు, పిల్లలకు ఆడుకునే క్రీడా సదుపాయాలు, ఒకేరకమైన తోటల, పూల మొక్కలు కలిగిన ఆకర్షణగా తీర్చిదిద్దే ట్రాక్స్ లను అందుబాటులొ ఉంచాల్సి ఉందన్నారు. కేరళ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని మారేడుమిల్లిలో రిసార్ట్స్ నిర్వహించడం ద్వారా పర్యాటకులను ఆకట్టుకోవడం జరిగిందన్నారు. అదే తరహాలో కడియం నర్సరీలకు మరింత ప్రాచుర్యం తీసుకువచ్చేందుకు పర్యాటక పరంగా అభివృద్ధి చేయడం జరగాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వపరంగా పర్యాటక శాఖ ద్వారా భవిష్యత్తులో విస్తృతస్థాయిలో ప్రచారాన్ని కల్పించడం జరుగుతుందని కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. 2027 పుష్కరాల గోదావరి పుష్కరాలు సమయానికి రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అభివృద్ధికి ఇప్పటినుండే కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

ఈ సమావేశంలో టూరిజం ప్రాంతీయ జాయింట్ డైరెక్టర్ వి స్వామి నాయుడు జిల్లా హార్టికల్చర్ అధికారి/ ఏపీ ఎమ్ఐపి పిడి అడపా దుర్గేష్, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, సర్ ఆర్థర్ కాటన్ నర్సరీ అసోసియేషన్ అధ్యక్షులు మల్లు బాలరాజు, నర్సరీ ప్రతినిధులు పుల్ల సత్యనారాయణ పుల్ల రాజశేఖర్ పెనుమాక బాబు, సత్యదేవ నర్సరీ విజయదుర్గ నర్సరీ తదితర నర్సరీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *