Breaking News

పారదర్శక సేవలు అందించడంతో పాటు సహకార వృద్ధే లక్ష్యం

– రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖా మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర వ్యాప్తంగా సహకార వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రివర్యులు  కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం విజయవాడ క్యాంపు కార్యాలయంలో సహకార సమాచారం పుస్తకాన్ని మంత్రి అచ్చెన్నాయుడు ఆవిష్కరించారు. సహకార వ్యవస్థను ప్రక్షాళన చేసి పారదర్శకంగా సహకార సేవలు రైతులకు చేరువ చేసేందుకు ప్రత్యేకంగా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోపరేటివ్ యూనియన్ ఆధ్వర్యంలో సహకార సమాచారం మాస పత్రిక (మేగ్జైన్) ప్రారంభం అవడం మంచి పరిణామం అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ రాష్ట్ర సహకార యూనియన్ విజయవాడ వారిచే నిర్వహించబడు వివిధ సహకార శిక్షణా కార్యక్రమాల గురించి సభ్యులు మంత్రి కి వివరించారు. ప్రతి నెలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సహకార సంఘాలన్నిటికీ మరియు ప్రజాప్రతినిధులకు సహకార బ్యాంకులకు సహకార సమాచారం పుస్తకాన్ని పంపిణీ చేయనున్నట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు.

ఈ పత్రికలో సహకార సంఘముల విజయ గాధలు, సహకార సంఘములలో ఇటీవల పరిణామాలు గవర్నమెంట్ చేయబడిన జీవోలు ప్రచురించుట జరుగునని తెలియజేశారు. రాష్ట్ర సహకార యూనియన్ చే నిర్వహించబడుచున్న ఆరుమాసముల డిప్లమో ఇన్ కోఆపరేటివ్ మేనేజ్మెంట్ రాష్ట్రంలోని నాలుగు సహకార శిక్షణా కేంద్రంలో నిర్వహించబడుతున్నదని తెలిపినారు.

యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు ఆదిమూలం వెంకటేశ్వరరావు, సెక్రటరీ సిహెచ్ వి రామారావు ట్రెజరర్ సోమేశ్వరరావు,వైస్ ప్రెసిడెంట్ ఎం రామ్మోహన్రావు, రామదాసు శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్ వి. శ్రీనివాస రావు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *