Breaking News

ఎంపి కేశినేని శివ‌నాథ్ కి మెమోరాండం అందించిన ఎ.పి.ఎస్.టి.ఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర‌ప్ర‌దేశ్ స‌మ‌గ్ర శిక్ష‌లు ఇంక్లూజివ్ ఎడ్యుకేష‌న్ విభాగంలో దివ్యాంగుల‌కు కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిలో విద్యాబోధ‌న చేసే ఐఆర్టీల‌ను విద్యాశాఖ‌లో విలీనం చేయాల‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ స్పెష‌ల్ టీచ‌ర్ ఫెడ‌రేష‌న్ తరుఫున విజ‌య‌వాడ ఎంపి కేశినేని శివ‌నాథ్ (చిన్ని)కి విన‌తి ప‌త్రాన్ని అంద‌జేయ‌టం జ‌రిగింది. గురునాన‌క్ కాల‌నీలోని విజ‌య‌వాడ పార్లమెంట్ కార్యాల‌యం ఎన్టీఆర్ భ‌వ‌న్ లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కో-క‌న్వీన‌ర్ మాల‌కొండ శ్రీధ‌ర్ ఆధ్వ‌ర్యంలో ఎ.పి.ఎస్.టి.ఎఫ్ రాష్ట్ర అధ్య‌క్షుడు ఎస్.నాగ‌రాజు గురువారం ఎం.పి కేశినేని శివ‌నాథ్ (చిన్ని) క‌ల‌వ‌టం జ‌రిగింది. కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాల మేర‌కు రాష్ట్రంలో ఖాళీగా వున్న 6,800 టీచ‌ర్ పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని, ప్ర‌స్తుతం ప‌నిచేస్తున్న ఐఆర్టీల‌ను అందులో మెర్జింగ్ చేసి నోటిఫికేష‌న్ ఇచ్చే విధంగా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు. ఐఆర్టీల స‌మ‌స్య‌ల విన్న ఎంపి కేశినేని శివ‌నాథ్ సానుకూలంగా స్పందించారు. సంబంధిత‌ అధికారుల‌తో మాట్లాడ‌తాన‌ని చెప్ప‌టం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ జె.శ్రీను, సహిత విద్యా ఉపాధ్యాయులు కె.సోమ‌రాజు, డి.నిర్మ‌ల‌, ఎ.శ్రీల‌త పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *