Breaking News

వ్యవసాయ అనుబంధ రంగాల్లో పూర్వవైభవాన్ని తీసుకువస్తాం

-రైతులు ఆత్మగౌరవంతో తలెత్తకు జీవించేందుకు అవసరమైన అన్నిరకాలచర్యలు చేపడతాం
-అందుకే ఆరు ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేశాము
-రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు,సమస్యలు ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి
-ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుండి “పొలంపిలుస్తోంది” కార్యక్రమం
-వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన అన్ని రకాల పరికరాలను, పనిముట్లను రైతులకు అందజేస్తాం
-మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులను లాక్కునే 144 & 217 జీఓలను రద్దుచేస్తున్నాం
-మత్స్యకారులకు అందజేసే డీజిల్ రాయితీ పథకాన్ని పునరుద్దరిస్తున్నాం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రూ.10 కోట్లు మంజూరు చేశారు
-పాడి పరిశ్రమ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించాము, రేపటి నుండి పశువుల డీవార్మింగ్ శిభిరాలను నిర్వహిస్తున్నాము
-రాష్ట్రంలో పశుగణాలసంఖ్యను తెలుసుకునేందుకు ఇంటింటి పశుగణన సర్వేను నిర్వహిస్తాం
-రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర జనాభాలో 62 శాతం పైగా ఉన్న రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకు మరియు రాష్ట్ర జీడీపీలో 35 శాతం వాటాను అందజేసే వ్యవసాయ అనుబంధ రంగాల్లో పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ది మరియు మత్స్య శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక, పాడి అభివృద్ది మరియు మత్స్య శాఖ మంత్రిగా వేద పండితుల మంత్రచ్ఛారణలు, ఆశీర్వచనాలు మధ్య పూజా కార్యక్రమం అనంతరం రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మంత్రిగా బాధ్యత చేపట్టిన వెంటనే వ్యవసాయ అనుబంధ శాఖలకు సంబంధించిన మొత్తం ఆరు ఫైళ్లపై తొలి సంతకం చేశారు.

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జనాభాలో దాదాపు 3.07 కోట్లు మంది ఆధారపడిన ఉన్న అతి పెద్ద వ్యవసాయ అనుబంధ రంగాల శాఖలను అచెంచల విశ్వాసంతో తమకు అప్పగించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. గత ప్రభుత్వం రైతుల పట్ల పూర్తి స్థాయిలో నిర్లక్ష్య దోరణితో వ్యవహరించిందని, కనీసం భూసార పరీక్షలు కూడా నిర్వహించ కుండా వ్యవసాయ శాఖకు తాళాలు వేసేశిందని విమర్శించారు. రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించకపోవడమే కాకుండా రైతు ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కూడా ప్రకటించ లేదన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి ఐదారు మాసాలకు కూడా డబ్బులను చెల్లించ లేని దుస్థితిలో గత ప్రభుత్వం ఉందన్నారు. అందు వంటి పరిస్థితులు తమ ప్రభుత్వంలో పునరావృతం కాకుండా రాష్ట్రంలోని రైతులు ఆత్మగౌరవంతో తలెత్తకు జీవించేందుకు అవసరమైన అన్నిరకాల చర్యలు చేపట్టే విధంగా ఆరు ముఖ్యమైన ఫైళ్లపై తొలి సంతకం చేయడం జరిగిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు, సమస్యలు ఏమన్నా ఉంటే వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసువస్తే వెంటనే వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపడతామనే బరోసాను ఇచ్చారు. కౌలు రైతులకు కార్డులను జారీచేసి బుణాలు అందజేయడమేకాకుండా, వారికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. ఆధునిక వ్యవసాయ పద్దతులపై రైతుల్లో అవగాహన కల్పించేందుకు ఈ నెల 23 నుండి “పొలంపిలుస్తోంది” కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రతి ఏడాది ఖరీఫ్ మరియు రభీ సీజనల్లో నాలుగు మాసాల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు ఆయన తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు అవసరమైన అన్ని రకాల వ్యక్తి గత వ్యవసాయ పరికరాలను, పనిముట్లను రైతులకు అందజేస్తామన్నారు. మత్స్యకారులకు జీవనాధారమైన చేపల చెరువులను లాక్కునేందుకు గత ప్రభుత్వం జారీచేసిన జీఓ సంఖ్య.144 & 217 లను రద్దుచేస్తూ నేడు సంతకం చేయడం జరిగిందన్నారు. మత్స్యకారులకు అందజేసే డీజిల్ రాయితీ పథకాన్ని కూడా గత ప్రభుత్వం నిలుపు దల చేసిందని, ఆ పథకాన్ని మళ్లీ పునరుద్దరిస్తున్నామని, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రూ.10 కోట్లను మంజూరు చేయడం జరిగిందన్నారు. పాడి పరిశ్రమ అభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించామని, రేపటి నుండి రాష్ట్ర వ్యాప్తంగా పశువుల డీవార్మింగ్ శిభిరాలను నిర్వహిస్తున్నామన్నారు. అదే విధంగా రాష్ట్రంలో పశుగణాల సంఖ్యను తెలుసుకునేందుకు పశు గణన సర్వేను కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు.

ఈ సందర్బంగా రాష్జ్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ , రాష్ట్ర మత్యశాఖ కార్యదర్శి బాబు ఎ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ కార్యదర్శి ఎమ్.ఎమ్ నాయక్, వ్యవసాయ శాఖ స్పెషల్ కమిషనర్ హరి కిరణ్ తదితర అదికారులతో పలువురు ప్రజా ప్రతినిధులు మంత్రికి పుష్ప గుచ్చాలు అందజేస్తూ అభినందనలు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *