Breaking News

మధ్యాహ్న భోజనం మెనూ అమల్లో ప్రత్యేక శ్రద్ధ

-జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి

పాలకోడేరు, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యా బోధనతో పాటు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి సూచించారు. పాలకోడేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం మధ్యాహ్నం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకస్మికంగా తనిఖీ చేసారు. మధ్యాహ్నం భోజనంను స్వయంగా రుచి చూసి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా నాగరాణి మాట్లాడుతూ 10వ తరగతి 100 శాతం ఉత్తీర్ణత సాధించాలన్నాటు. సబ్జెక్టు బాగా నేర్చుకుంటే భవిష్యత్తులో మంచి ఉపయోగం ఉంటుందని విద్యార్థులకు ఆమె సూచించారు.

మధ్యాహ్నం భోజనం పథకం మెనూ బోర్డులను పరిశీలించి మెనూ ప్రకారం భోజనాలు విద్యార్థులకు అందించాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నందున పిల్లలు ఆరోగ్య అలవాట్లను పాటించాలని సూచించారు. భోజనం ముందు తరువాత చేతులను శుభ్రపరుచు కోవాలని తెలిపారు. మెనూ ప్రకారం వంటలు తయారు చేసారా లేదా అని పరిశీలించడమే కాకుండా వడ్డించిన పదార్థాలను నిశితంగా పరిశీలించారు. విద్యార్దులతో కలసి సహపంక్తి భోజనం చేసారు. రోజువారీ తయారు చేసే వంటలు గురించి విద్యార్ధులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు అందరూ పాఠశాలలో తప్పక మధ్యాహ్న భోజనం చేయాలని తెలిపారు. గుడ్డు, చిక్క, రాగి జావ తప్పకుండా తీసుకోవాలని విద్యార్థులకు సూచించారు. పరిశుభ్రమైన నీటితో వంటలు చేయాలని, త్రాగునీరు కలుషితం కాకుండా చూడాలని ఆదేశించారు. వర్షాకాలం కనుక వంట దగ్గర, వడ్డించే దగ్గర, బోజనం చేయు ప్రదేశం పరిశుభ్రంగా ఉండేలా చూడాలని ప్రధానోపాద్యాయుడు పి.మహేశ్ బాబును ఆదేశించారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు.
జిల్లా కలెక్టర్ పాఠశాలను సందర్శించిన సందర్భంలో విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ, మద్యాహ్న భోజన జిల్లా కో ఆర్డివీటర్లు కె.కృష్ణారావు, జి.చిన్నియ్య, మండల విద్యాశాఖ అధికారి పి.నాగరాజు, ఉప విద్యాశాఖాధికారి ఎన్. శ్రీనివాస్. బీమవరం ఎంఈఓ 2, సీఆర్పీలు అన్నపూర్ణ, వెంకటేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *