Breaking News

టూరిజం లో ఉన్నత అధికారుల పై సమగ్ర విచారణ జరిపి మరలా మాకు ఉద్యోగ అవకాశాలు ఇచ్చి ఆదుకోవాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భవాని ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ లో పనిచేసే ఎంప్లాయిస్ ని ఉద్యోగాల నుంచి తొలగించిన అధికారుల పై సమగ్ర విచారణ చేసి మరల మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని భవాని ఐలాండ్ టూరిజం కార్పొరేషన్ ఔట్సోర్సింగ్ లో పనిచేసే ఎంప్లాయిస్ ఈరోజు గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారు. భవానిపురం ఐలాండ్లో ఔట్సోర్సింగ్ ఎంప్లాయ్ గా 11 మంది గత ఏడు సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారికి విధించిన స్వీపర్స్, సెక్యూరిటీ గార్డ్, బ్యాటరీ కారు డ్రైవర్ గాను, విధులను నిర్వహిస్తున్నారు. వాళ్లపై అధికారులు అయినా సివిల్ ఏఈ శశికుమార్, ఎలక్ట్రికల్ ఏ.ఈ శంషుద్దీన్, ఆదేశాలు మేరకు భవాని ఐలాండ్లోకి వచ్చినటువంటి టూరిస్టులకు టికెట్లు ఇవ్వడం. టికెట్స్ అమ్మగా వచ్చిన డబ్బును టూరిజం బ్యాంక్ అకౌంట్ లో డిపాజిట్ చేయటం. ఇది అంతా పై అధికారులు
ఏ.ఈల పరిరక్షణలో జరుగుతూ ఉంటుంది.

01.05.2023 తేదీన, ఐదుగురు గుప్పెట్లో భవాని ద్వీపం, బక్క చిక్కుతున్న భవాని దీపం అని ఆర్టికల్ పేపర్ లో రావడం జరిగింది. మమ్మల్ని ఆఫ్కాస్ లో జాయిన్ చేసేందుకు మా ఒక్కొక్కరి దగ్గర 5000 రూపాయలు తీసుకున్నారు. గతంలో మాకు రావాల్సిన మూడు నెలల జీతం మాకు ఇవ్వడానికి ఏ.ఈ లంచం తీసుకున్నారు ఈ వ్యవహారం అంతా కూడా ఒక పత్రికలో ప్రచురితం అవడంతో పేపర్లో వచ్చిన ఆ ఆర్టికల్ కి మాకు ఎటువంటి సంబంధం లేనప్పటికీ ,మా ఆఫ్కాస్ ఎంప్లాయిస్ దగ్గర డబ్బులు తీసుకున్న విషయం భవాని ఐలాండ్ లో విషయాలు మీకు మాకు తప్ప ఎవరికీ తెలియదు. మీరు చెప్పకుండా ఎలా బయటకు వచ్చింది. ఇంత వివరంగా ఎలా తెలుస్తుందని అన్నారు. మాపైన వ్యక్తిగతమైన కక్ష పెంచుకొని, అనుమానంతో మమ్మల్ని బలి పశువులు చేశారు. అసభ్యకరమైన మాటలతో శారీరకంగా, మానసికంగా, హింసకు గురి చేసేవారు. ఏ.ఈలు మాపై కక్ష సాధింపులు భాగంగా మేము తప్పు చేయనప్పటికీ చేసామని. మమ్మల్ని దొంగలుగా ముద్ర వేశారు.
జనరల్ మేనేజర్ ఈ విషయాలపై సమగ్ర విచారణ జరుపకుండా అకస్మాత్తుగా 11.12.2023 తేదీ న, మా అందరి ఫోన్లు తీసుకొని తెల్ల కాగితాలపై సంతకం చేయించుకొని మరికొందరి చేత ఏ.ఈలు చెప్పినట్లు లెటర్ రాయించుకుని సంతకాలు పెట్టించుకున్నారు. కానీ మేము ఎటువంటి తప్పు చేయనప్పటికీ తప్పు చేశారని ముద్రవేశారు. కనీస సహజ న్యాయ సూత్రాలు ఉన్నాయి పాటించకుండా మాకు ఎటువంటి షోకాస్ నోటీసులు కానీ, మెమోస్ కానీ, ఎంక్వయిరీలు గాని చేయకుండా,18/12/23 తారీఖున మా అందరిని ఉద్యోగల్లో నుంచి తొలగించడం జరిగింది.. కాంట్రాక్టు ఉద్యోగుల్ని, ఉన్నతాధికారుల్ని కాపాడేందుకు మాలాంటి చిన్న ఉద్యోగస్తుల్ని బలి చేయడం జరిగింది.
ఉద్యోగం పోవడంతో కత్తెర శెట్టి రవిబాబు మానసిక ఒత్తిడి గురై అనారోగ్యానికి పాలై చనిపోయారు. సమగ్ర విచారణ జరిపి అధికారులు మాకు న్యాయం చేయాలని మళ్లీ మమ్మల్ని విధుల్లోకి తీసుకొని చనిపోయిన కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ఇచ్చి మాకు రావలసినటువంటి జీతాలు ఏలవేన్స్ ఇవ్వగలరని అధికారులన్నీ కోరుచున్నాము. మాకు న్యాయం జరగని ఎడల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కలుస్తామని అన్నారు.
ఈ సమావేశంలో కత్తిరా శెట్టి అనిల్ కుమార్, పి.రవీంద్ర, ఎన్.రాజ్యలక్ష్మి, ఎం.శ్రీనివాసరావు, సుబ్రహ్మణ్యం, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *