Breaking News

ఈ నెల 14 న నిర్వహించనున్న యుపిఎస్సి Combined Medical Services-2024 పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి

-తిరుపతి జిల్లాలో 3 పరీక్ష కేంద్రాలు
-హాజరుకానున్న 1199 అభ్యర్థులు : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం.యస్ మురళి

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈనెల 14న జిల్లాలో జరగనున్న యూపీఎస్సీ Combined Medical Services-2024 పరీక్షలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేయడం జరిగిందని స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ యం.యస్ మురళి పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సంబంధిత అధికారులతో ఈ నెల 14 న జరగనున్న యుపిఎస్సి పరీక్షల నిర్వహణపై సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ ఈ నెల 14 న యుపిఎస్సి నిర్వహించనున్న Combined Medical Services-2024 పోస్టులకు ఉ. 9.30 నుండి ఉ 11.30 వరకు 3 సెంటర్లలో మరియు మ.2.00 నుండి మ.4.00 వరకు 3 సెంటర్లలో పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.

తిరుపతి జిల్లాలో ఈ పరీక్షలకు మొత్తం 3 సెంటర్ లు ఏర్పాటు చేయడం జరిగిందనీ 1199 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ పరీక్షల కొరకు 3 మంది తాసిల్దార్లను లైజన్ అధికారులుగా, 1 జిల్లా అధికారి ని సహాయ సమన్వయ అధికారులుగా విధులు కేటాయించడం జరిగిందని , తిరుపతి ఆర్.డి.ఓ పరీక్షా పేపర్ల కస్టోడియన్ గా వ్యవహరిస్తారని తెలిపారు.

పరీక్షా కేంద్రాలలోకి మొబైల్ ఫోన్, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్ లు, వైర్లెస్ హెడ్ సెట్స్, తదితర ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతి ఉండదని , పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు, ఆర్టీసి బస్సు సౌకర్యం,విద్యుత్ అంతరాయం లేకుండా సంబందిత శాఖల అధికారులు చూడాలని, త్రాగు నీరు, టాయిలెట్స్ సక్రమంగా ఉండాలని, అభ్యర్థుల సౌకర్యార్దం సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకునే విధంగా ఆర్ టి సి వారు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు.

Combined Medical Services-2024 పరీక్షా కేంద్రాల వివరాలు:

50001 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – A), తిరుపతి
50002 శ్రీ పద్మావతీ మహిళా జూనియర్ కాలేజ్ (వింగ్ – B), తిరుపతి
50018 SV ఆర్ట్స్ కాలేజ్ (వింగ్ – A), తిరుపతి

ఈ సమావేశంలో ఆర్డీఓ తిరుపతి నిషాంత్ రెడ్డి, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *