Breaking News

అమరావతి పనులు అతివేగంగా జరుగుతున్నాయి…

-ఎమ్మెల్యే గద్దె రామమోహన్

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలతో అమరావతిలో అతివేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని శాసనసభ్యులు గద్దె రామమోహన్ అన్నారు. శనివారం ఉదయం 4వ డివిజన్ ఫిల్మ్ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్, కార్పొరేటర్ జాస్తి సాంబశివరావుతో కలిసి పర్యటించి స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పిల్మ్ కాలనీ మెయిన్ రోడ్డు, 1, 2 క్రాస్ రోడ్డుల నిర్మాణానికి రూ. 19.99 లక్షలతో శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఆర్ధిక ఇబ్బందులు ఏమీ లేవని, అవన్నీ వైకాపారు చేసే తప్పుడు ప్రచారాలన్నారు. కేంద్రంలో కూడా నరేంద్రమోడీ సహకారంతో రాష్ట్ర అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. సుమారు లక్ష కోట్ల రూపాయలు ఎటువంటి వడ్డీలేని నిధులు రాష్ట్ర ఖజానాకు రాబోతున్నాయని ఈ నిధులతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరగనున్నాయన్నారు. నియోజకవర్గంలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నా వాటి పనులు చేపట్టాలని దానికి నిధులు కేటాయిస్తానని తనకు చంద్రబాబు నాయుడు చెప్పారన్నారు. పోలవరం ప్రాజెక్ట్, అమరావతి నిర్మాణం కూడా చంద్రబాబు ప్రభుత్వంలో త్వరితగతిన పూర్తిచేయడం జరుగుతాయని చెప్పారు. 2014-19 సంవత్సరంలో నిధులు లేకపోయినా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియోజకవర్గం అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధుల కేటాయించారని అందువల్లే 2014-19 కాలంలో ఎన్నడూ లేనివిధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం జరిగిందన్నారు.

ఆత్మీయ సమావేశం
ఫిల్మ్ కాలనీలో స్థానికులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గద్దె రామమోహన్ మాట్లాడుతూ ఎన్నడూ జరగని విధంగా 2024 ఎన్నికలు జరిగాయని, కూటమి అభ్యర్ధులను ప్రజలు అత్యధిక మెజార్టీలతో గెలిపించారన్నారు. వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా తీర్పు ఇచ్చారన్నారు. తనకు అత్యధిక మోజార్టీ ఇచ్చినందుకు స్థానిక ప్రజలకు గద్దె రామమోహన్ కృతజ్ఞతలు తెలియజేశారు.

కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు మాట్లాడుతూ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశ్యంతో వైకాపా నాయకులు ఈ ప్రాంతంలోని ఓటర్లను పక్క డివిజన్ కు మార్చి గందరగోళం సృష్టించారన్నారు. దీనిపై తాము అధికారులను పలు మార్లు కోరినా అధికార పార్టీ ఒత్తిడిలకు తలొగ్గారన్నారు. అయినప్పటికీ ఈ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులకు ప్రజలు బ్రహారధం పట్టారన్నారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చొరవతో త్వరితగిన పూర్తి చేస్తామన్నారు.

ఈ కార్యక్రమం కాలనీ ప్రెసిడెంట్ ఎస్.వెంకటేశ్వరెడ్డి, నర్రా శ్రీనివాసరావు, ఏమినా సాయిరామ్, చెన్నుపాటి ప్రసాద్, బత్తిన కిషోర్, గద్దె రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *