Breaking News

విద్య, వైద్య ఆరోగ్యానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెద్దపీట

-పేదలకు మెరుగైన వైద్యం అందించడం మా ప్రభుత్వ ద్వేయం
-వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదు
-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి

అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త :
విద్య, వైద్యం ఆరోగ్యానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా పొదిలిలో ప్రాంతీయ వైద్యశాలను మంత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా..ఆస్పత్రి గోడలపై నాటి ముఖ్యమంత్రి జగన్ ఫోటోలు ఉండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారినా ప్రభుత్వ భవనాలపై నాటి ముఖ్యమంత్రి ఫోటోలు ఉండటం ఏంటని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించి, ఆస్పత్రిలో అందుతున్న వైద్యంపై మంత్రి రోగులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అన్ని రకాల వైద్యులు ఉన్నా వైద్యం చేయకుండా రోగులను బయట ఆసుపత్రులకు పంపిస్తున్నారని రోగులు, స్థానిక ప్రజలు మంత్రికి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలను ఏదో ఉద్ధరించామంటూ గత ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని, అందుకు ఈ ఆసుపత్రిలో పరిస్థితిలే నిదర్శనం అన్నారు. ఆస్పత్రిలో రోగులకు సరిపడా పరికరాలు అందుబాటులో లేవన్నారు రక్త నిల్వ కేంద్రం ఉన్నా రోగులకు ఉపయోగపడం లేదన్నారు. త్వరలోనే ఆసుపత్రికి కావలసిన పరికరాలు అందుబాటులోకి తెస్తామని రక్తనిల్వ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తామని మంత్రి అన్నారు. తమ ప్రభుత్వం విద్యా, వైద్య ఆరోగ్యానికి పెద్ద పెద్ద వేస్తుందని, ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే తమ లక్ష్యమన్నారు. వైసిపి హయాంలో మాదిరి ఉద్యోగులు నిర్లక్ష్యంగా ఉంటే సహించేది లేదని, ఉద్యోగులతో మా ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఉంటుందని ఉద్యోగులు కష్టపడి పనిచేసే ప్రభుత్వానికి మంచి పేరు రావాలని మంత్రి సూచించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *