Breaking News

చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు..

-ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవచ్చు.
-18 రకములైన చేతివృత్తులు చేసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
స్వయం ఉపాధి ప్రాతిపదికన, చేతి వృత్తులు, సంప్రదాయ సాధనాలపై ఆధారపడిన కళాకారులు సమగ్ర సహాయాన్ని అందుకునేందుకు ప్రధానమంత్రి విశ్వకర్మ క్రింద నమోదు చేసుకోవడానికి అర్హులని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలియజేశారు. స్ధానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో శనివారం సమన్వయ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పి ఎం విశ్వకర్మ పథకం ద్వారా 18 రకములైన చేతివృత్తులు చేసుకునే వారికి ఇదొక చక్కటి అవకాశం అన్నారు. జిల్లాలో సుమారు 45 వేల మంది పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందన్నారు. మరింత మంది అర్హులని గుర్తించి వారి పేర్లు నమోదు చెయ్యాలని ఆదేశించారు. 2023 సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభం అయిన ఈ పథకం 2027-28 వరకు అమలులో ఉంటుందని, గత ఏడాది డిసెంబర్ నుంచి అన్ని జిల్లాల్లో అమలులోకి రావడం జరిగిందన్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందే కేటగిరిలలో కళాకారులు మరియు చేతివృత్తిదారుల ప్రయోజనాలను అందించడం కోసం నిర్దేశించినట్లు తెలిపారు. సాంప్రదాయ చేతి వృత్తి దారులకు వృత్తులు కేటగిరిలో పడవలు తయారుచేసేవారు, వడ్రంగులు, ఆయుధాలు తయారుచేసే వారు, కమ్మరి, సుత్తులు మరియు టూల్ కిట్లు తయారు చేసేవారు, తాళాలు తయారుచేసేవారు, శిల్పులు మరియు రాళ్ళు పగులగొట్టే వారు, స్వర్ణకారులు, కుమ్మరులు, చెప్పులు కుట్టేవారు / పాదరక్షల కళాకారులు, తాపీమేస్త్రీలు, బుట్టలు / చాపలు, చీపుర్లు / కాయిర్ వస్తువులు , బొమ్మల (సాంప్రదాయ), క్షురకులు , పూలదండలు , చాకలి, దర్జీలు (టైలర్), చేపల వలలు కుల వృత్తుల వారికీ సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల కింద అర్హులు అని తెలిపారు. లబ్దిదారుడు రిజిస్ట్రేషన్ తేదీ నాటికి 18 ఏళ్లు నిండి గతంలో రుణం పొంది తీర్చిన వాళ్ళు, తమ రుణాన్ని పూర్తిగా తిరిగి చెల్లించిన ముద్రా మరియు స్వానిధి లబ్దిదారులు అర్హులు అని తెలిపారు.

లబ్దిదారులు CSC (మీ సేవా కేంద్రాలు) లేదా గ్రామ సచివాలయం లేదా వార్డు సచివాలయం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఆమేరకు సమన్వయ శాఖలు నైపుణ్యాభివృద్ధి, డిఆర్డిఏ మెప్మా పరిశ్రమలు పంచాయతీలు డెవలప్మెంట్ అధికారులు లబ్ధిదారుల గుర్తింపును వేగవంతం చేయాలన్నారు.

లబ్దిదారులు రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, మొబైల్ నంబర్, బ్యాంకు వివరాలు, రేషన్ కార్డు వంటి పత్రాలను సమర్పించాలన్నారు. నైపుణ్య అంచనా ప్రాథమిక శిక్షణకు ముందు అంచనా వేసి నామినేట్ చేయబడిన కేంద్రాలలో 40 గంటలు, 5-7 రోజులు పాటు నిర్వహించాల్సి ఉందన్నారు. ఆసక్తి ఉన్న లబ్దిదారులు 15 రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. శిక్షణ కాలంలొ స్టైఫండ్ ఇవ్వడం, బ్యాంకు రుణ సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. నిరుపేద, పేద, మధ్యతరగతి కేటగిరీల కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువతకి ఇదో చక్కటి అవకాశం అన్నారు. ఈ పధకం అమలులో సమన్వయకర్త గా జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి వ్యవహరిస్తారని కలెక్టర్ స్పష్టం చేశారు.

ఈ సమన్వయ కమిటీ సమావేశంలో సమావేశంలో ఇంచార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి పికేపి ప్రసాద్, డిపివో డి. రాంబాబు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎం. కొండల రావు, డి ఆర్ డీ ఏ పిడి ఎన్వివిఎస్ మూర్తి,  డి ఎల్ డి ఓ పీ. వీణాదేవి, వి. శాంతా మణి, ఎల్ డి ఎమ్ డివి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *