Breaking News

అధిక వర్షాలు – వరి పంటలో తక్షణ రక్షణ చర్యలు

-జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు రైతులకి సూచనలు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
వరి నాట్లు జరుగుచున్న ప్రస్తుత తరుణంలో అధిక వర్షాలకు జిల్లా లోని 10 మండలాల్లోని లోతట్టు గ్రామాలలో 917 హెక్టార్ల వరి పంట ఒక అడుగు వరకు మునగటం జరిగినదని జిల్లా వ్యవసాయ అధికారి ఎస్. మాధవ రావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు . ప్రస్తుతం నాట్లు వేసి 15 నుండి 16 రోజుల దశలో వున్నందున పంటకు సాధారణంగా ఏటువంటి నష్టం వాటిళ్ళనప్పటికి , అధిక నీటిని తక్షణమే తీసే విధముగా డ్రెయినేజీ పారుదల వ్యవస్థ ఏర్పాట్లు చేయాల్సి ఉందన్నారు. పంట పొలాల్లో నీరు తగ్గిన వెంటనే అత్యవసర చర్యగా ఎకరాకు 20 నుండి 25 కిలోల యూరియా (urea) తో పాటు 10 నుండి 15 కిలోల పొటాష్ (MOP) బూస్టర్ డోస్ గా పైరుపై వెదజల్లే ప్రక్రియ చేపట్టాల్సి ఉందన్నారు.

వాతావరణ పరిస్థితుల్లో తెగుళ్ళలో ముఖ్యముగా పొడతెగులు ఆశించే అవకాశ ముంటుంది కనుక, నివారణ చర్యలు నిమిత్తమై హెక్సా కొనోజోల్ 2 ఎమ్ ఎల్ లేదా వాలిడామై సిన్ 2 ఎమ్ ఎల్ ఒక లీటరు నీటి లో కలిపి ఎకరాకు 200 లీటర్ల ద్రావణాన్ని పైరు పూర్తిగా తడిసే విధముగా పిచికారి చేయాల్సి ఉందన్నారు. నాటిన పొలాల్లో ఖాళీలు లలో ఏర్పడిన్నట్లయితే, మొక్కల సాంధ్రత తగ్గకుండా వుండుటకు, అందు బాటులో వున్న నారు తో ఖాళీలు భర్తీ చేయాలని మాధవరావు తెలియ చెయ్యడం జరిగింది.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *