Breaking News

గ్రీవెన్స్ ద్వారా ప్రజా సమస్యల అర్జీలను పరిష్కరించేలా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారానే కాకుండా జిల్లా మండల స్థాయిలో ప్రతి రోజు గ్రీవెన్స్ ద్వారా ప్రజా సమస్యల అర్జీలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా . జి. సృజన అన్నారు.

నగరంలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్ నుండి సోమవారం జిల్లా మండల స్థాయి అధికారులతో పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్, శానిటేషన్, త్రాగునీరు, సీజనల్ వ్యాధుల పై జిల్లా కలెక్టర్ సృజన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందస్తు అనుమతి లేకుండా జిల్లా స్థాయి అధికారులు, ఎంపిడివోలు, తహశీల్దార్లు ప్రధాన కార్యాలయం విడచి వెళ్లరాదన్నారు. సెలవు రోజుల్లో కూడా తప్పనిసరి ముందస్తు అనుమతి తీసుకోవాలన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్ ద్వారా ప్రజల నుండి స్వీకరించే అర్జీలకు సరైన ఎండార్స్ మెంట్ ఉండాలన్నారు. సమర్పించిన అర్జీ పరిష్కారం కాలేదనే ఫిర్యాదు రాకూడదని దీనిపై పూర్తీ స్థాయిలో అర్జీని పరిశీలించడం జరుగుతుందన్నారు. సోమవారం నిర్వహించే గ్రీవెన్స్ తో పాటు ప్రతి రోజు జిల్లా మండల స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ నిర్వహించి ప్రజల నుండి ధరఖాస్తులను స్వీకరించేలా సిస్టమ్, ప్రింటర్, బ్యానర్ ఏర్పాటు చేసేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖలకు చెందిన ఫైల్స్ ఈ ఆఫీస్ ద్వారానే నిర్వహణ జరుగుతుందని ఫిజికల్ గా ఫైల్స్ ను పరిష్కరించడం జరగదన్నారు. ప్రతి సోమవారం ఫైల్స్ పరిష్కారంపై సమీక్షించడం జరుగుతుందన్నారు. వర్షాలు కురుస్తున్నందున కాల్వ గట్ల పటిష్టతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని వాగులు పొంగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాలలో సీజనల్ వ్యాధుల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు ప్రబల కుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ చల్లడం వంటి పారిశుధ్య కార్యక్రమాలను నిర్వహించేలా పంచాయితీరాజ్ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి మంగళవారం శానిటేషన్ పై సమీక్షిస్తానన్నారు. కలెక్టరేట్ లో ప్రాజెక్ట్ మోనిటరింగ్ యూనిట్ (పిఎంయు) ఏర్పాటు చేసి శాఖల వారిగా అర్జీల పరిష్కారం పెండింగ్ ఫైల్స్, న్యాయస్థాన వివాదాలు, తదితర కార్యకలాపాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి. సృజన అన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ డా.పి. సంపత్ కుమార్, డిఆర్వో వి. శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కిరణ్మయి, డీఆర్డీఏ పీడి కె. శ్రీనివాసరావు, డీఈవో వెంకట సుబ్బారావు, సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉమా మహేశ్వరరావు, ఐసీడీఎస్ పిడి జి. ఉమాదేవి, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి కె. అనురాధ, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *