Breaking News

జిల్లాలో ప్రారంభమైన కుష్టు ‌వ్యాధిగ్రస్తుల గుర్తింపు సర్వే

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి నుండి జిల్లాలో ఉన్న‌ కుష్టు ‌వ్యాధిగ్రస్తులను ప్రాథమిక దశలోనే గుర్తించుటకు జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారిని డాక్టర్ జి. గీతాబాయి అధ్యక్షతన మరియు డాక్టర్ ఏ వెంకట్రావు జిల్లా లెప్రసీ నియంత్రణ అధికారి పర్యవేక్షణలో వైద్యాధికారులు, ఆరోగ్య కేంద్ర నోడల్ అధికారులు ద్వారా క్షేత్రస్థాయి సిబ్బందికి లెప్రసీ కేస్ డిటెక్షన్ క్యాంపెయిన్ పై శిక్షణ కార్యక్రమం నుపూర్తిచేసి సర్వే నిర్వహించుటకు ఆశా కార్యకర్త మరియు ఒక మగ వాలంటీర్ ను గ్రూపు సభ్యులుగా ఏర్పాటు చేసుకొని కుటుంబ సర్వే కార్యక్రమాన్ని ప్రారంభించినారు. ఈ సందర్భంగా మచిలీపట్నంలోని నారాయణపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్‌టి. సి.హెచ్ .వి.వీరేంద్రనాథ్ మాట్లాడుతూ ఈ ఎల్ .సి. డి .సి .కార్యక్రమం నేటి నుండి 14 రోజుల పాటు క్షేత్రస్థాయి ఆరోగ్య ‌సిబ్బంది టీం సభ్యులుగా ఏర్పడి గృహ దర్శనములు ద్వారా కుటుంబ సభ్యులలో ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉన్న ఎడల గుర్తించి తెలియజేయడం జరుగుతుంది .ఈ కుష్టి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు చర్మంపై స్పర్శ లేని రాగి రంగు గల మచ్చలు మరియు చర్మం పొడిగా ఉండటం, కనుబొమ్మలు మరియు కనురెప్పల వెంట్రుకలు రాలిపోవడం, కనురెప్పలు మూతపడకపోవడం, మందమైనా మెరిసే జిడ్డు గల చర్మం ,చేతుల నుండి వస్తువులు జారిపోవడం, అరిచేతులు ,అరికాళ్ళలో స్పర్శ కోల్పోవడం, తెలియకుండానే చేతులు, కాళ్లలో బొబ్బలు రావడం, చేతి వేళ్ళు ,కాలి వేళ్ళు వంకర్లు తిరిగి అంగవైకల్యం రావటం , కాళ్లకు చెప్పులు జారిపోవుట ,కాళీ పాదము క్రిందికి పడిపోవడం మరియు నడకలో మార్పు, పాదాలు వాపు ,చల్లని లేదా వేడి వస్తువులు స్పర్శ తెలియక పోవడం మొదలైన అనుమానిత లక్షణాలు ఉన్న ఎడల మీ ఇంటి వద్దకు వచ్చినటువంటి క్షేత్రస్థాయి సిబ్బంది కి తెలియజేసిన వారి‌వివరాలను ఏఎన్ఎం లాగిన్ ద్వారా వైద్యాధికారికి తెలియజేస్తూ సదరు వ్యక్తికి సంబంధించిన పూర్తి వివరాలతో రిఫరల్ స్లిప్పును వైద్యాధికారి వద్దకు పంపించడం జరుగుతుంది. తదుపరి వైద్యాధికారి వ్యాధిగ్రస్తునికి సంబంధించిన లక్షణాలను బట్టి వ్యాధి నిర్ధారణ చేసి మల్టీ డ్రగ్ తెరఫీ మందులను వైద్య సిబ్బంది ద్వారా ఉచితంగా అందించటం జరుగుతుంది. వ్యాధి చికిత్స కాలమందు ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణ తప్పనిసరిగా ఉంటుంది. కావున ప్రజలందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇలాంటి లక్షణాలు ఉన్నవారు పరీక్ష చేయించుకొని వ్యాధి నిర్ధారణ చేయించుకోవలసినదిగా వైద్యాధికారి ప్రజలను కోరినారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆరోగ్య విద్య మరియు విస్తరణాధికారి బి. శివసాంబి‌రెడ్డి ,కే స్వర్ణకుమారి ఏ.ఎన్.ఎం., జి .రఘు శ్యాంబాబు ల్యాబ్ టెక్నీషియన్,వై. శివసుధ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *