Breaking News

అధిక వర్షాలు నేపధ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

-వరదలు వచ్చే అవకాశం నేపధ్యంలో అత్యవసర సేవలకై సన్నద్ధంగా ఉండాలి
-మండల ప్రత్యేక అధికారులు మండల కేంద్రాల్లో అందుబాటులో ఉండాలి
-సీజనల్ వ్యాధుల పట్ల పూర్తి అప్రమత్తంగా ఉండాలి
-క్షేత్ర స్థాయిలో బలహీనంగా ఉన్న బండ్ లని గుర్తించి రక్షణ చర్యలు చేపట్టాలి
-అత్యవసర మందులు, నిత్యవసర వస్తువులు అందుబాటులో ఉంచాలి
-పునరావాస కేంద్రాలను సన్నద్ధంగా ఉంచుకోవాలి,
– పరిస్థితులకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పన ఉండాలి
-జిల్లా, డివిజన్ స్థాయి 24 X 7 కంట్రోల్ రూం లు ఏర్పాటు
-కంట్రోల్ రూం నెంబర్ లు
– కలెక్టరేట్ 8977935609
– రాజమండ్రీ ఆర్డీవో – 0883 2442344
– కొవ్వూరు సబ్ కలెక్టర్ – 08812 231488
-విద్యుత్తు ఫిర్యాదుల కేంద్రా కంట్రోల్ రూం నెంబర్ 1902
– పరిస్థితి సాధారణ స్థితికి వొచ్చే వరకు సెలవులు రద్దు
-జిల్లాల వారీగా పరిస్థితులపై ప్రథాన కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్
– జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర విపత్తుల నిర్వహణా సంస్ధ హెచ్చరికలు, రానున్న మూడు నాలుగు రోజుల్లో భారీ వర్షాలు వలన గోదావరి నదికి వరదలు సంభవించే అవకాశం దృష్ట్యా పరిస్థితులను ఎదుర్కునేందుకు సమన్వయ శాఖల అధికారులు సర్వసన్నద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

గురువారం మధ్యాహ్నం కలెక్టరేట్ సమావేశ మందిరం గోదావరీ నదికి వరదలు.. ముందస్తు భద్రత ఏర్పాట్లు పై కలెక్టర్ పి.. ప్రశాంతి జిల్లా, డివిజన్, మండల గ్రామ స్థాయి అధికారులతో వీడియో/ జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సంధర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ, ప్రస్తుతం వాతావరణ శాఖ హెచ్చరికలు నేపథ్యం లో ప్రతి శాఖా వారికీ నిర్దేశించిన ప్రోటోకాల్ మేరకు ముందస్తు కార్యచరణ తో సంసిద్ధంగా ఉండాలన్నారు. గోదావరీ నది పరివాహక ప్రాంతాల్లో అధికారులు, సిబ్బంది పర్యటించి బలహీనంగా ఉన్న గట్లు గుర్తించి, వాటిని ఇరిగేషన్ అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి రక్షణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బి రహదారు లను, బలహీనంగా ఉన్న  కాజ్ వే లు, పాత వంతెనలు, లోతట్టు ప్రదేశాలను, ముంపు కు గురి అయ్యే ప్రదేశాలను గుర్తించి, పరిశీలించి తగిన పనులు చేపట్టడం, పోలీసు వారి సహకారంతో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి హెల్త్ ప్రోటోకాల్ మేరకు హెల్త్ క్యాంపు లను నిర్వహించాలని, అవసరమైతే గ్రామ స్థాయిలో మెడికల్ సేవలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. స్నేక్ బైట్ కి చెందిన మందులు, కుక్క కాటు మందులు ఇతరత్రా మందులు అందుబాటులొ ఉంచాలన్నారు.

జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూం లు ఏర్పాటు చేసినట్లు బొమ్మూరు కలెక్టరేట్ 8977935609 , రాజమండ్రీ ఆర్డీవో కార్యాలయం 0883 2442344 ,
కొవ్వూరు సబ్ కలెక్టర్ కార్యాలయం 08812 231488 నెంబర్ల 24 X 7 మూడు షిఫ్టుల్లో సిబ్బంది అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు. *విద్యుత్తు ఫిర్యాదుల కేంద్రా కంట్రోల్ రూం నెంబర్ 1902 కు విద్యుత్ సమస్యలు పై ఫిర్యాదులు చెయ్యవచ్చు అని తెలిపారు.

పంచాయతీ అధికారులు శానిటేషన్ పై తగిన జాగ్రత్తలు చేపట్టాలి, ఆర్ డబ్ల్యూ ఎస్ , మున్సిపాలిటీలు త్రాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

కొవ్వూరు, సీతానగరం, రాజమండ్రి రూరల్ అర్బన్ ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న లంక గ్రామాలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని,హెచ్చరికను దృష్టిలో పెట్టుకొని పునరావాస కేంద్రాలకు తరలించే విధానంలో సన్నద్ధం గా ఉండడం, ప్రజలకి అవగాహన కల్పించాలన్నారు. పునరావాస కేంద్రాలుగా గుర్తించి భవనాలు తనిఖీ చేయాలన్నారు. పాత భవనాల్లో తరగతులు నిర్వహిస్తున్న తరగతి విద్యార్థులను పక్క భవనాల్లో క్లాసులు నిర్వహించాలనీ డి ఈ వో ఆమేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

సీజనల్ వ్యాధులను దృష్టిలో పెట్టుకుని శానిటేషన్, బ్లీచింగ్ విషయంలో , స్ప్రే లు వెదజల్లే ఏర్పాట్లు చేయాలన్నారు.

సాయంత్రం రాష్ట్ర ప్రథాన కార్యదర్శి నిరభ్ కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్ల తో భారీ వర్షాలు నేపధ్యంలో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా, కలెక్టర్ పి. ప్రశాంతి, ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ కే. దినేష్ కుమార్, డి ఆర్వో జి. నరసింహులు, ఎస్ ఈ ఇరిగేషన్ జి. శ్రీనివాస రావు, డి ఎమ్ హెచ్ వో దా కె. వేంకటేశ్వర రావు, జిల్లా ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారి డి. బాల శంకర రావు, రూరల్ తహసీల్దార్ వై వి కె అప్పారావు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *