Breaking News

ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి అన్ని జిల్లాల్లో సమావేశాలు

-కేసలి అప్పారావు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దడానికి 26 జిల్లాల్లో సమావేశాలు,అవగాహనా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు మేరకు ఇటీవల కాలంలో బాలలు మీద జరుగుతున్న దురదృష్టకర సంఘటనలు దృష్ట్యా అన్ని శాఖల సమన్వయం, భాగస్వామ్యంతో డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చి దిద్దిడానికి కమిషన్ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జూన్ 30 వ తేదీన డిల్లీలో జాతీయ బాలల హక్కుల కమిషన్ మరియు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వారు సంయుక్తంగా బాలలు మత్తు పదార్థాలు మరియు మారక ద్రవ్యాలు నియంత్రణ చర్యలు గురుంచి మన దేశానికి సంబంధించిన అన్ని రాష్ట్రాలకు ,కేంద్ర పాలిత ప్రాంతాలు కు సంబంధించి బాలలు తో పనిచేస్తున్న కీలక శాఖలతో ఆయా రాష్ట్రాల్లో అమలు జరుగుతున్న విధానం, నియంత్రణ కోసం చేపడుతున్న కార్యక్రమాలు వివరించారు.
ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ బాలల హక్కుల కమిషన్ చైర్మన్ పాటు సహచర సభ్యులు జంగము రాజేంద్ర ప్రసాద్, గోండు సీతారాం, ట్రిపర్ణ అధిలక్ష్మి మరియు బత్తుల పద్మావతి తో కలిసి వందరోజులు కార్యాచరణ ప్రణాళికను రూపొందించికోవడం జరిగిందనీ, బాలలు కోసము పనిచేస్తున్న ముఖ్య శాఖలైన పోలీసు శాఖ, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ,ఎక్సైజ్ శాఖ,సాంఘిక సంక్షేమశాఖ,పంచయత్ రాజ్, మున్సిపల్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ,రైల్వే శాఖ ,రవాణా శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ,మొదలగు శాఖలు మరియు స్వచ్ఛంద సేవా సంస్థలు కు సంబంధించి అధికారులు ,అనథికారులు ఆధ్వర్యంలో గ్రామ,జిల్లా,రాష్ట్ర స్థాయిలో అవగాహన కార్యక్రమాలు, నిరంతర పర్యవేక్షణ చర్యలు చేపడతామని తెలిపారు.
రాష్ట్రంలో ప్రతీ జిల్లాలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన అమలుజరుగుతున్న జాయింట్ యాక్షన్ ప్లాన్ ను నిరంతరం నిర్దేశించబడిన కాలం ప్రకారం సమావేశాలు నిర్వహించడం,సాధించిన ప్రగతి గురుంచి చర్చించడం జరుగుతుందని తెలిపారు. మెడికల్ షాప్స్ మరియు మధ్యం షాపులులో తప్పని సరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం డ్రగ్స్ నియంత్రణ కోసము అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు నిపుణులు సహకారంతో చర్యలు ప్రభుత్వం తీసుకుంటున్నారని, .డ్రగ్స్ నియంత్రణ కోసము ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతుంధని iమరికొన్ని ప్రత్యేక కౌన్సిలింగ్ విదానాలు, పునరావాస కేంద్రాలు , రీ ఎడిక్షన్ కేంద్రాలును ఏర్పాటు తో పాటు పాఠశాలలు, కళాశాలలు ,పునరావాస కేంద్రాలు మరియు వసతి గృహాల్లో మనస్తత్వ వేత్తల నియామకం కోసము ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అలాగే అన్ని పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ప్రహరీ క్లబ్ లు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే విశాఖ, విజయనగరం జిల్లాల్లో జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడం జరిగాయని రేపు 19 న పార్వతీపురం మరియు 20 న శ్రీకాకుళం జిల్లాలో సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని అప్పారావు తెలిపారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *