Breaking News

మెప్మాకు అవార్డుల పంట

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2023-24 లో “దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్” కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు వరించిన అవార్డులు

సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (SPARK), పెర్ఫార్మన్స్ రెకగ్నిషన్ ఫర్ ఆక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లుసన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మెంట్ (PRAISE)పేర్లతో అవార్డులు

పీఎం స్వనిధి ద్వారా ఆర్ధిక చేయూత, సాధికారత సాధనలో అత్యుత్తమ పనితీరుకు గుర్తింపు

న్యూఢిల్లీలోని ఇండియా హబిటాట్ సెంటర్ లో అవార్డుల ప్రదానం

అవార్డు అందుకున్న మెప్మా మిషన్ డైరెక్టర్ వి. విజయలక్ష్మి, స్టేట్ మిషన్ మేనేజర్లు ఆదినారాయణ, రంగాచార్యులు,  ఎన్ఎన్ఆర్ శ్రీనివాస్, ప్రభావతి

2023-24 ఆర్థిక సంవత్సరంలో “దీన్ దయాళ్ అంత్యోదయ యోజన – జాతీయ పట్టణ జీవనోపాధుల మిషన్” (DAY-NULM) కార్యక్రమాలు విజయవంతంగా అమలు చేసినందుకు పట్టణ జీవనోపాధికి ఉత్తమ భాగస్వామ్య నమూనా విభాగంలో సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ అనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ (SPARK)అవార్డు వరించింది. అదే విధంగా PM SVANidhi ద్వారా వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత, సాధికారత సాధించడంలో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు పెర్ఫార్మన్స్ రెకగ్నిషన్ ఫర్ ఆక్సెస్ టు ఫైనాన్సియల్ ఇంక్లుసన్ అండ్ స్ట్రీట్ వెండోర్స్ ఎంపవర్మేంట్ (PRAISE) అవార్డు ఆంధ్రప్రదేశ్ మెప్మా ను వరించింది.

ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని స్టెయిన్ ఆడిటోరియం, ఇండియా హబిటాట్ సెంటర్ నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవార్డుల ప్రదాన కార్యక్రమం జరిగింది. కేంద్ర పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖామాత్యులు మనోహర్ లాల్ ఖట్టర్, పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ సహాయమాత్యులు తోఖాన్ సాహు, పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ కార్యదర్శి అనురాగ్ జైన్, DAY NULM జాయింట్ సెక్రటరీ  రాహుల్ కపూర్  చేతుల మీదుగా మెప్మా మిషన్ డైరెక్టర్ వి. విజయలక్ష్మి, స్టేట్ మిషన్ మేనేజర్లు  ఆదినారాయణ, రంగాచార్యులు,  NNR శ్రీనివాస్, ప్రభావతి ఈరోజు అవార్డులను స్వీకరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *